New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 1

ఏమ్ మాయ చేసావే..!! – 1

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి…

చల్లగా వీచే గాలులు… ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది…

వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి…

కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా?? అని కోపంగా గట్టిగా అరిచిందిp…

ఆ అరుపు గాలిలో కలిసి పోకుండా బురద చిమ్మించిన కార్ లో ఉన్న వ్యక్తి కి వినపడి తన బ్లాక్ సెడాన్ కారు కొంత దూరం వెళ్లి సడన్ బ్రేక్ వేయడంతో ఇరువైపులా చిన్న ఫౌంటన్స్ లా చిమ్మింది గుంతలలో ఉన్న నీరు….

కారు డోర్ తెరుచుకోగానే బ్లాక్ కలర్ సూట్‌లో మెరిసిపోతూ కళ్లకున్న గాగుల్స్‌ను స్టైలిష్‌గా సెట్ చేస్తూ అడుగు బయటపెట్టాడు క్రిషవ్ రాజ్

ఆరడుగుల ఎత్తు… ఎత్తుకు తగ్గ పర్ఫెక్ట్ ఫిజిక్… గాలికి అలల్లా ఎగురుతున్న సిల్కీ హెయిర్ ని తన విశాలమైన నుదుటి పైన పడకుండా సెట్ చేసుకుంటూ నడిచి వస్తుంటే… పదునైన నాసిక… లోతైన ఆలోచనలను దాచి ఉంచే గంభీరమైన కళ్లు.. చిరునవ్వును సైతం దాచే తీరైనా మీసకట్టు ని చూస్తున్న శాన్వి కి ఒక హాలీవుడ్ హీరో ని చూసినట్టు గా అనిపించి ఒక్క క్షణం తనకే తెలియకుండా అతడి మీదే చూపు నిలిపింది…

దగ్గరగా వచ్చిన క్రిషవ్ రాజ్ … హలో మిస్ అని మొహం మీద చిటికె వేయడం తో తేరుకొని కొంచెం వెనక్కి జరిగింది

క్రిషవ్ రాజ్ తన కళ్ళకి ఉన్న గాగల్స్ తీసి ఏంటి ఇందాక ఏదో అంటున్నావ్ అని గంభీరంగా అడుగుతూ…. నన్ను తిట్టావ్ కదా నువ్వు??  అని సూటిగా అడిగాడు సీరియస్ గా తననే చూస్తూ

అప్పుడు గుర్తుకు వచ్చింది శాన్వి కి తనపై బురద చల్లాడు అని… కార్ లో కూర్చోగానే కళ్ళు నెత్తికేక్కుతాయా మీకు… రోడ్ మీద ఉన్న వాళ్ళు కనిపించరా??? ఇలాగేనా బురద చిమ్మేది అని తన డ్రెస్ పై పడిన బురద చూపిస్తూ… గుంతలు ఉన్న రోడ్ల మీదకి వచ్చినప్పుడు జాగ్రత్తగా నడపాలనే సెన్స్ లేదా??? అని కోపంతో ఊగిపోయింది…

కాకిలా అరుస్తున్న శాన్వి గొంతుకి చిరాకుగా ఫీల్ అయ్యి షటప్!!! అని చిన్నగా అరిచిన క్రిషవ్ గంభీరమైన గొంతుకి శాన్వి ఒక్కసారిగా జనికి వెనక్కి జరిగింది…

శాన్వి కి మరింత దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ  లిజన్ మిస్!! నా కళ్ళు ఎక్కడున్నాయో నాకు తెలుసు కానీ… నీకు కళ్ళు కనిపించట్లేదా????  రోడ్డు మీద గుంతలు ఉన్నాయి అని తెలిసినప్పుడు వాటి పక్క నుండే వెళ్లడం ఎందుకు??  వచ్చే పోయే వెహికల్స్ ని ఎందుకు బ్లేమ్ చేస్తారు బురద చిమ్మారు అని ఆ పక్క నుండి వెళ్లొచ్చు గా అని సీరియస్ గా చెప్తుంటే…

అతడి అహంకారానికి ఒళ్ళు మండిన శాన్వి కిందకి వంగి బురద తీసి ఇంకా ఏదో మాట్లాడుతున్న క్రిషవ్ మీదకు చల్లి అక్కడ నుండి మెరుపు వేగంతో పరిగెత్తింది…

బ్లాక్ సూట్ మీద పడ్డ బురద అంతగా కనిపించకపోయినా  అనుకొని ఆ సంఘటన కి క్రిషవ్ ఒక్క క్షణం స్టన్ అయిపోయాడు…

సెకన్ల వ్యవధిలోనే అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది….  వెనక్కి తిరిగి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ పరిగెడుతున్న శాన్వి వైపు చూస్తూ యూ బ్లడీ స్టూపిడ్ ఇడియట్!!! అని గట్టిగా అరుస్తూ యూ విల్ పే ఫర్ దిస్.. ఐ స్వేర్.. యూ విల్ పే ఫర్ దిస్!! అని నిప్పులు చెరుగుతున్న కళ్ళతో పిడికిలి బిగించాడు….

తన జీవితంలో తనను ఇంతలా అవమానించిన వ్యక్తి అంటూ ఎవరూ లేరు… తన ఇగోని ఇంత దారుణంగా దెబ్బతీసిన ఆ అమ్మాయిని వదిలిపెట్టకూడదని అక్కడే ఫిక్స్ అయ్యాడు మన క్రిషవ్ రాజ్….

ఆయాసంగా పరిగెత్తుకుని ఇంటికి వస్తున్న రెండో కూతురిని చూసి ఏమైందే ఏంటి ఈ అవతారం అని శాన్వి వాళ్ళ అమ్మ సులోచన గారు అడుగుతుంటే కళ్ళున్నా ఓ కబోధి చేసిన పనిలే ఇది అంటు ఫాస్ట్ గా వెళ్లి స్నానం చేసే టైమ్ లేక డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇక బస్ కోసం చూస్తే లేట్ అవుతుందని ఆటో లో కాలేజ్ కి వెళ్ళడానికి సిద్దమయ్యింది…

ఇడియట్ వాడి వల్లే ఈ రోజు యాభై రూపాయలు బొక్క నాకు అని క్రిషవ్ ని తిడుతూ కాలేజ్ ముందు దిగింది శాన్వి…

@ ఇంకా ఉంది

@ హాయ్ మై డియర్ స్వీట్ బడ్డీస్…  స్టోరి ఎలా ఉందో చదివి రేటింగ్ ఇచ్చి ఫాలో చేసి నా రచన మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో చెప్పి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్…