New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 2

ఏమ్ మాయ చేసావే..!! – 2

ఇడియట్ వాడి వల్లే ఈ రోజు యాభై రూపాయలు బొక్క నాకు అని క్రిషవ్ ని తిడుతూ కాలేజ్ ముందు దిగింది శాన్వి…

 

అప్పటికే అరగంట ఆలస్యం అయిపోయిందని పరుగు పరుగున క్లాస్ కి వెళ్ళింది….

 

 

అప్పటికే లెక్చరర్ క్లాస్ లో ఉండటం తో క్లాస్ లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ అడిగిన పాపానికి ఆ లెక్చరర్ కూడా లెక్చర్ ఇవ్వడంతో ఛ!!! ప్రొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఈ రోజంతా ఏంటినాకు ఈ క్లాస్ లు అనుకొని విసుక్కుంటున్న శాన్వి ని లోపలికి రమ్మని తన క్లాస్ కంటిన్యూ చేశాడు ఆ లెక్చరర్…

 

 

శాన్వి బెస్ట్ ఫ్రెండ్ అయినా గీత.. ఏమైందే!! ఎందుకు లేట్ అయింది అని అడిగింది తన పక్కన కూర్చోగానే…

 

 

అదో పెద్ద కథలే క్లాస్ అయ్యాక చెప్తా అని ఇంట్రెస్టింగ్ గా క్లాస్ వింటుంటే అప్పుడే క్లాస్ అయిపోయినట్టు బెల్ రింగ్ వినిపించగానే ఆ లెక్చరర్ వెళ్ళిపోయాడు….

 

 

ఎయిట్ కే రెడీ అయ్యాను అని కాల్ చేసి ఎయిట్ థర్టీ కి బస్ స్టాప్ కి రాకుండా ఏమ్ చేసావే… అడిగితే పెద్ద కథ అంటున్నావ్ ఏంటా కథ అంది…

 

 

ఓ రోగ్!! బస్ స్టాప్ కి వస్తుంటే బురద చల్లాడు అంది విసుక్కుంటూ…

 

 

అవునా!!! మరి వాడిని ఊరికే వదిలేసావా???? అంది శాన్వి గురించి బాగా తెలిసిన గీత..

 

 

హమ్మా!!!! వాడ్ని అంత ఈజీగా వదిలేస్తుందా ఈ శాన్వి ??  బురద చల్లిందే కాకుండా సూటు బూటు వేసుకుని మరి లెక్చర్ ఇచ్చాడు వెధవ…  అందుకే వాడికి నా స్టైల్ లో బుద్ది చెప్పి ఆ కోటు మీద బురద కొట్టి మరి వచ్చా అని నవ్వుతుంటే అప్పుడే ఎంటర్ అయ్యాడు మరో లెక్చరర్ 

 

ఆ లెక్చరర్ ని చూసి అందరూ కళ్ళు మెరిసిపోతుంటే నవ్వుతున్న శాన్వి మాత్రం బిగుసుకు పోయి… సచ్చినోడు అయిపోయాడు నా చేతుల్లో… బురద చల్లాను అని వెతుక్కుంటూ మరి వచ్చినట్టు ఉన్నాడు… కోతి మొహమోడు అని కసి తీరా తిడుతున్న శాన్వి ని చూసి ఏమైందే ఎందుకు నీలో నువ్వే గొనుకుంటున్నావ్ అని అడిగింది గీత…

 

 

గొనుక్కోవడం కాదే వాడు నన్ను గెలకాలి అప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో అందరి ముందే వంగోబెట్టి గుద్దుతా అని ఉక్రోషంగా ఊగిపోతుంది శాన్వి…

 

 

హే పిచ్చి గానీ పట్టిందేంటే!!!! నీ గురించి తెలిసి కూడా ఎవడే కాలేజ్ కి వచ్చి మరి నిన్ను గెలికేది అని కసురుకుంటునే .. అదంతా వదిలేసి ముందు వచ్చిన ఈ కొత్త లెక్చరర్ ని చూడవే బాబు !! హీరో లెక్క ఉన్నాడు ఇంత అందమైన యంగ్ హీరో వచ్చి క్లాస్ చెప్తే ఎవడే?? క్లాస్ ఎగొట్టేది… అని ఆరాధన గా క్రిషవ్ వైపు చూస్తూ బెంచ్ మీద మోచేతిని ఆనించి గడ్డం కింద చేతిని పెట్టుకుని కన్నార్పకుండా చూస్తుంది…

 

 

ఆల్మోస్ట్ ఆ క్లాస్ లో గర్ల్స్ అందరి పరిస్థితి అదే ఓ ఇద్దరు తప్ప… అందులో ఒకరు శాన్వి అయితే మరొకరు క్రిషవ్ చెల్లెలు కృతిక…

 

 

శాన్వి కళ్ళు క్రిషవ్ ని కోపంగా చూస్తుంటే… శాన్వి ని కోపంగా చూస్తుంది కృతిక…

 

 

ఎందుకు అనుకుంటున్నారా?????

 

 

రోడ్ మీద బురద చల్లెలా కార్ డ్రైవ్ చేసింది క్రిషవ్ కాదు… కృతిక…

 

 

ఫాస్ట్ గా వెళ్ళు అన్నయ్య అని స్టీరింగ్ క్రిష్ చేతిలో ఉన్నా తనని డిస్టర్బ్ చేస్తూ ఫాస్ట్ గా స్టీరింగ్ ని తిప్పింది కృతిక…

 

 

అప్పుడే శాన్వి పై బురద పడింది… యాక్చువల్లీ సారీ చెప్పడానికే కార్ అపాడు క్రిష్ కానీ శాన్వి తన నోటి దూలతో  కోపం తెప్పించింది…

 

 

అప్పటికి సార్ లెక్చరర్ కాబట్టి పద్ధతి గానే లెక్చర్ ఇస్తుంటే బురద కొట్టి మట్టి పరిగెత్తింది…. ఇదంతా కార్ లో ఉండి చూసిన కృతిక వెంటనే కార్ దిగి వచ్చి కార్ తిప్పు అన్నయ్య ఎంత దూరం పరిగెడుతుందో చూద్దాం రోడ్ సైడ్ రోగ్ అని పళ్ళు నూరుతున్న చెల్లి ని ఆపి… కృతి నువ్వు కాలేజ్ కి వెళ్ళు నేను ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అన్నాడు…

 

 

అంత ఈజీ గా దాన్నెలా వదిలి పెడతావ్ అన్నయ్య అసలే  మన కాలేజ్ లో నీకు లెక్చరర్ గా ఫస్ట్ డే అని అసహనంగా అడుగుతున్న కృతికతో  తను మరోసారి మన కంట పడక పోదా అప్పుడు చూద్దాం ఇప్పటికే లేట్ అవుతుంది పదా అని తనని సెల్ఫ్ డ్రైవ్ లో సేఫ్ గా వెళ్ళమని క్యాబ్ బుక్ చేసుకున్నాడు క్రిష్…

 

@ ఇంకా ఉంది

@ హాయ్ మై డియర్ స్వీట్ బడ్డీస్…  స్టోరి ఎలా ఉందో చదివి రేటింగ్ ఇచ్చి ఫాలో చేసి నా రచన మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో చెప్పి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్…