ఏమ్ మాయ చేసావే..!! – 4
లిజన్ ఎవ్రీవన్! నా క్లాస్‌లో నాకు మెయిన్ గా కావాల్సినవి రెండే రెండు.. ఒకటి టైమ్ పంక్చువాలిటీ.. రెండు మ్యానర్స్! బయట మీరు ఎలాంటి అల్లరి చిల్లర వేషాలు వేసినా అది మీ పర్సనల్ లైఫ్. కానీ వన్స్ నా క్లాస్‌లో అడుగుపెట్టిన తర్వాత.. యు షుడ్ బిహేవ్ లైక్ ప్రొఫెషనల్స్!!!! అన్నాడు తన గొంతుని తగ్గించకుండా ఆ వాయిస్ లో కోపం లేదు కానీ ఒక రకమైన అథారిటీ ఉంది..
ఎవరైనా సరే పొరపాటున కూడా డిసిప్లిన్ అనే గీత దాటాలని చూస్తే… వాళ్ళకి మేనేజ్‌మెంట్ లెసన్స్ తో పాటు… ఈ క్రిషవ్ రాజ్ స్టైల్ లో లైఫ్ లెసన్స్ కూడా నేర్పించాల్సి ఉంటుంది… ఎందుకంటే.. బయట మీరు చేసే చిన్న తప్పు కూడా మీ కెరీర్‌ని నాశనం చేస్తుంది… నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు.. మిమ్మల్ని బెస్ట్ బిజినెస్ లీడర్స్ గా తీర్చిదిద్దడానికి మాత్రమే అన్నాడు అదే వాయిస్ తో….
సో క్లాస్ రూమ్ అంటే కేవలం చదువుకునే చోటు మాత్రమే కాదు.. పద్ధతులు నేర్చుకునే చోటు కూడా… ఐ హోప్ ఐ యామ్ వెరీ క్లియర్!!!! అని చాలా కూల్ గా మెల్టింగ్ వాయిస్ తో చెప్తుంటే…. వీడు కేవలం కోపిష్టి మాత్రమే కాదు.. చాలా తెలివైన వాడు కూడా అని చిన్నగా నవ్వుకుంది శాన్వి…
గీత అయితే శాన్వి భుజం మీద కొట్టి.. మెల్లిగా చెవి దగ్గరికి వెళ్లి చూశావా శాన్వీ!! సర్ కోపంలో సింహం లా ఉన్నాడు.. మాట్లాడితే మాత్రం అమృతం చెవిలో పోసినట్టుగా అనిపిస్తుంది… ఇక నుండి క్రిష్ సర్ మై క్రష్ అని మెల్లగా ఊదేసింది.
ఏంటి వీడు నీకు క్రష్ హా??? ఓసేయ్ ఇందాక రోడ్ మీద బురద కొట్టింది వీడినే…. వీడికి క్రిషవ్ రాజ్ అని కాదు బురద రాజ్ అని పెట్టాలి అంది ఆక్రోషంగా….
మై డియర్ క్లాస్ ఈ రోజు స్ట్రాటెజిక్ మానేజ్మెంట్ గురించి తెలుసుకుందాం అని బోర్డ్ వైపు తిరిగి రాస్తుంటే గీత శాన్వి లా గొనుగోడు చెవిలో పడ్డ రాజ్ మెరుపు వేగంతో వెనక్కి తిరిగి చాక్ వాళ్ళ పై విసిరి డయాస్ దిగి మెల్లగా వాళ్ళ వైపు నడుచుకుంటూ దగ్గరికి వచ్చి స్టాండప్ అన్నాడు గొంతులో పదునైన బేస్ తో…
ఆ వాయిస్ కి భయపడి కొంచెం ఇబ్బందిగా ఇద్దరు లేచి నిలబడితే క్రిష్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుంటూ తీక్షణంగా శాన్వి వైపే చూస్తూ వాట్స్ యువర్ నేమ్? అని అడిగాడు.
ఆ వాయిస్ లోని బేస్ కి కొంచెం తడబడుతూ శాన్వి అంది..
క్రిష్ వెంటనే పక్కనే ఉన్న గీత వైపు తిరిగి తన కనుబొమ్మలు ముడివేస్తూ అండ్ యు?? అని అడిగాడు..
గీత అయితే అప్పటికే భయంతో వణికిపోతూ గీ.. గీత సార్!!! అని తడబడుతూ సమాధానమిచ్చింది..
శాన్వి అండ్ గీత నైస్ నేమ్స్… క్లాస్ కి వచ్చారా???? లేక కాఫీ షాప్ కి వచ్చాను అనుకుంటున్నారా??? అన్నాడు గంబీరమైన వాయిస్ తో…
ఆ వాయిస్ కి గీత వణికిపోయి శాన్వి వెనుక దాక్కున్నట్టు గా వెనక్కి జరుగుతూ శాన్వి చేతిని పట్టుకుని నొక్కుతుంటే…. క్లాస్ లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు….
క్లాస్ రూమ్ అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోవడం కాదు మిస్ శాన్వి…. ఒకరి సమయాన్ని.. ఒకరి జ్ఞానాన్ని గౌరవించడం…. నేను ఇక్కడ గొంతు చించుకుని మాట్లాడుతుంటే మీరు టైమ్ పాస్ గాసిప్స్ చెప్పుకుంటారా???? అన్నాడు పళ్ళు నూరుతూ
కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి వాయిస్ లో వినిపిస్తున్న కఠినత కి ఎంత ధైర్యంగా ఉందమన్నా తన వల్ల కాక కళ్ళని దించేసింది శాన్వి…
మళ్ళీ డయాస్ వైపు నడిచిన క్రిష్…. క్లాస్ అందరిని చూస్తూ లెక్చరర్ బోర్డు వైపు తిరిగితే క్లాస్ మీ కంట్రోల్‌లోకి వస్తుందని అనుకుంటున్నారేమో???? గెట్ దిస్ వెరీ క్లియర్… నేను బోర్డు వైపు చూస్తున్నా నా కళ్లు మీ మీదనే ఉంటాయి…. మీ గొణుగుడు ఇక్కడ కూర్చున్న వంద మందికి వినిపించకపోవచ్చు… కానీ నా సబ్జెక్ట్‌ని అవమానిస్తున్న ఆ శబ్దం నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది…
డిసిప్లిన్ లేని చదువు.. విలువ లేని జ్ఞానం రెండూ వ్యర్థమే నా దృష్టిలో…. క్లాస్ అంటే క్లాసులాగే ఉండాలి… ఇక్కడ నేను చెప్పే ప్రతి మాటా మీకు పాఠం కావాలి తప్ప మీరు మాట్లాడుకోవడానికి అది ఒక సాకు కాకూడదు… ఇంకోసారి నా క్లాస్‌లో ఎవరైనా ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ కనిపిస్తే….
@ ఇంకా ఉంద
@ హాయ్ మై డియర్ స్వీట్ బడ్డీస్… స్టోరి ఎలా ఉందో చదివి రేటింగ్ ఇచ్చి ఫాలో చేసి నా రచన మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో చెప్పి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్…
Swipe left/right or tap the sides to turn pages