New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 3

ఏమ్ మాయ చేసావే..!! – 3

అంత ఈజీ గా దాన్నెలా వదిలి పెడతావ్ అన్నయ్య అసలే  మన కాలేజ్ లో నీకు లెక్చరర్ గా ఫస్ట్ డే అని అసహనంగా అడుగుతున్న కృతికతో  తను మరోసారి మన కంట పడక పోదా అప్పుడు చూద్దాం ఇప్పటికే లేట్ అవుతుంది పదా అని తనని సెల్ఫ్ డ్రైవ్ లో సేఫ్ గా వెళ్ళమని క్యాబ్ బుక్ చేసుకున్నాడు క్రిష్…

 

ఇంటికి వెళ్లిన క్రిష్ ని చూస్తూ నాన్న క్రిష్!! ఏమైంది ఎందుకు ఈ టైం లో ఇంటికి వచ్చావ్.. ఇన్ టైం లో నువ్వు కాలేజ్ లో లేకపోతే ఫస్ట్ డే నే లేట్ గా పంపించాను అని మనిద్దరికీ డిసిప్లేన్ లేదని క్లాస్ స్టార్ట్ చేస్తారు మీ నాన్న అన్నారు సవతి తల్లి అయినా మాధవి గారు…

 

జస్ట్ టెన్ మినిట్స్ మా!! అని ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కి తన రూమ్ కి వెళ్లి వాష్ రూమ్ లో దూరి షవర్ బాత్ చేసి ఫ్రెష్ అయ్యి మరో బ్లాక్ సూట్ లో కిందకి వచ్చేసాడు…

 

మా!! వెళ్తున్నా బాయ్ అని హాగ్ చేసుకోగానే అల్ ది బెస్ట్ నాన్న అని నుదుటికి ముద్దు పెట్టి పంపించారు మాధవి గారు…

 

కాలేజ్ కి వచ్చిన క్రిష్ ఫాస్ట్ గా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏంటి క్రిష్ ఫస్ట్ డే నే ఈ లేట్ కొంచెం కూడా టైమ్ పంక్చువాలిటీ లేకుండా…. స్టూడెంట్స్ కి నువ్వే ఎగ్జాంపుల్ అయ్యేలా ఉన్నావ్ అన్నారు కాస్త గంభీరంగా…

 

క్రిష్ ఒక్క క్షణం అసహనంగా తల వంచి రోడ్ లో ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది…. ఇక మీదట ఇలా జరగదు అని నెమ్మదిగా చెప్పాడు.

 

స్టూడెంట్స్ చెప్పినట్టు చిన్న పిల్లల రీసన్ చెప్పకు క్రిష్ అన్నారు అసహనంగా…

 

ఛ!!! ఇది అంతా బురద అమ్మాయ్ వల్లే… నువ్వు గానీ నాకు కనిపించాలి అయిపోయావే నా చేతిలో అని మనసులోనే కసి పెంచుకుంటున్న క్రిష్ ని చూస్తూ….

 

ఇది నీకు కొత్త కాలేజ్… కొత్త బాధ్యతలు… ఇక్కడ స్టూడెంట్స్ నిన్ను లెక్చరర్ గా మాత్రమే కాదు… వాళ్ళు నిన్ను ఒక రోల్ మోడల్ గా ఎంచుకునేలా ఉండాలి  క్రిష్ నీ హుందాతనం అన్నారు…

 

డాడ్!!! ఆపుతారా ఇక మీ లెక్చర్…

 

ఐ నో ఎవెర్య్థింగ్ డాడ్… అని విసుగ్గా అక్కడి నుండి బయటకి వచ్చేసాడు… క్రిష్ ఆ కాలేజ్ లో లెక్చరర్ మాత్రమే కాదు చైర్మన్  అండ్ MD కూడా….

 

క్రిష్ తాతగారు మనవడిని తన ఛైర్ లో చైర్మన్ లా చూడాలని ఎన్నో కలలు కన్నారు కానీ అవేవి చూడకుండానే ఆరోగ్య రీత్యా హాస్పిటల్ పాలయ్యారు…

 

ఫస్ట్ డే నే తండ్రి తో చివాట్లు తిన్నాను అని బుసలు కొడుతూ కారిడర్ లో నడుస్తున్న క్రిష్ కి క్లాస్ రూమ్ లో నవ్వుతూ కనిపించింది శాన్వి…

 

ఇదేంటి ఇక్కడుంది అని ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు క్రిష్ బాబు…

 

క్లాస్ కి వచ్చిన లెక్చరర్ ని చూడకుండా తన ఫ్లో లో తనే ఉన్న శాన్వి.. గీత మాటలకి వాడు లెక్చరర్ ఏంటి మొహం అద్దంలో చూసుకున్నాడా ఎప్పుడైనా అంటున్న శాన్వి మాటలు ఆగిపోయేలా సైలెన్స్ అని టేబుల్ పై అరచేతితో కొట్టాడు….

 

ఆ దెబ్బతో అందరూ సైలెన్స్ అయితే వీడు నిజంగానే లెక్చరర్ హా అనే షాక్ లో శాన్వి….

 

గుడ్ మార్నింగ్ క్లాస్!!!  ​ఐ యామ్ క్రిషవ్ రాజ్…. ఈ రోజు నుండి మీ బిజినెస్ మేనేజ్‌మెంట్ లెక్చరర్‌ని నేనే… నేను ఇక్కడ మీకు కేవలం పాఠాలు చెప్పడానికి మాత్రమే రాలేదు… ఒక బిజినెస్ లీడర్‌కి ఉండాల్సిన ఆటిట్యూడ్.. డిసిప్లిన్ ఎలా ఉంటాయో నేర్పించడానికి వచ్చాను…

 

క్రిషవ్ రాజ్ పేరులో ఉన్న రాయలిటీ వీడి బుద్ధి లో లేదు బురద చల్లే బుద్ధి అని నోట్లో నే తిట్టుకుంటున్న శాన్వి ని చూస్తూ ​క్రిష్ ఒక్కో అడుగు వేస్తూ డయాస్ అంచు వరకు వచ్చి కరెక్ట్ గా శాన్వి వైపు చూస్తూ…. లిజన్ ఎవ్రీవన్! నా క్లాస్‌లో నాకు మెయిన్ గా కావాల్సినవి రెండే రెండు.. ఒకటి టైమ్ పంక్చువాలిటీ.. రెండు మ్యానర్స్! బయట మీరు ఎలాంటి అల్లరి చిల్లర వేషాలు వేసినా అది మీ పర్సనల్ లైఫ్. కానీ వన్స్ నా క్లాస్‌లో అడుగుపెట్టిన తర్వాత.. యు షుడ్ బిహేవ్ లైక్ ప్రొఫెషనల్స్!!!! అన్నాడు తన గొంతుని తగ్గించకుండా ఆ వాయిస్ లో కోపం లేదు కానీ ఒక రకమైన అథారిటీ ఉంది..

@ ఇంకా ఉంది

@ హాయ్ మై డియర్ స్వీట్ బడ్డీస్…  స్టోరి ఎలా ఉందో చదివి రేటింగ్ ఇచ్చి ఫాలో చేసి నా రచన మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో చెప్పి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్…