మూడు రోజుల్లో తన కోరికను తీర్చకపోతే అనురాధ డ్రగ్స్ కి ఆడిక్ట్ అయ్యింది అని అందరిని నమ్మించి రియాబిలేషన్ సెంటర్ కి పంపించినట్టుగా పంపించి వేరే దేశాలకి తనని అమ్మేస్తాను అని చెప్పాడు అంట దశరథ్ పటేల్.
దాని గురించి భయపడుతూ ఈ అమ్మాయి ఈ రాత్రి సూసైడ్ చేసుకోవాలి అనుకుంది..
నేను ఒక్కదాన్నే ఎమ్మెల్యేని ఎదురించలేను నాకు మీ సాయం కావాలి సార్.. ఎమ్మెల్యే కి తొత్తులు ఉంటారు కొంతమంది అది మీ డిపార్ట్మెంట్లో కూడా,నేను ఇలా అంటే మీకు నచ్చదు కానీ మీ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు అందుకే ఎవరిని నమ్మాలో తెలియక మిమ్మల్ని ఆశ్రయించాను.” అని చెప్పింది వేద శౌర్యని చూస్తూ.
“మీరు అన్నది కూడా కరెక్టే.. మంచికి సాయం ఎలా అయితే అందుతుందో చెడు చేసే వాళ్ళకి కూడా అలాగే సాయం అందుతుంది.” అని అన్నాడు శౌర్య వేదాని చూస్తూ.
“మీరు అన్నది కూడా కరెక్టే.. మంచికి సాయం ఎలా అయితే అందుతుందో చెడు చేసే వాళ్ళకి కూడా అలాగే సాయం అందుతుంది.” అని అన్నాడు శౌర్య వేదాని చూస్తూ.