ఏంటి అన్నట్టుగా చూసింది వేద.
“ఏంటి సార్..?” అని అంది అను శౌర్యని చూస్తూ.
“దీనిని అన్ని సోషల్ మీడియాలలో విడుదల చేస్తాను.. దీనిని నేను విడుదల చేసిన మరుక్షణం హాట్ టాపిక్ అవుతుంది.
కారణం ఎమ్మెల్యే దశరథూ పటేల్, అతని దగ్గర హింసని అనుభవిస్తుంది అన్న కూతురు కాబట్టి.
ఇది ఎక్కువగా సోషల్ మీడియాలో తిరిగితే కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరిస్తుంది అప్పుడు కొట్టేయడానికి ఏ రాజకీయ పార్టీకి ఏ వ్యవస్థకి అవకాశం ఉండదు.
కోర్టు సుమోటోగా స్వీకరించిన వెంటనే మన దగ్గర ఉన్న సాక్షాలని ఒక కాపీ ఎగస్ట్రా తీసి పెట్టి కోర్టులకి సబ్మిట్ చేద్దాము.