లైన్ లో ఉన్న శౌర్య ఆ మాటలు విని చిరుకోపంగా..”సరేలే అమ్మతోపాటు అను కూడా వచ్చిందా..?” అని అడిగాడు శౌర్య.
“ఆ.. మీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అంట కదా..! ఆ అమ్మాయి ఉంది నా దగ్గరే.” అని చెప్పింది కస్తూరి ఎదురుగా ఉన్న అనుని చూస్తూ.
“తనకి ఫోన్ ఇవ్వు పిన్ని.” అని అన్నాడు శౌర్య.
“సరే ఇస్తున్న..’ అని తనకి ఆపోజిట్ లో కూర్చున్న అనుకి ఫోన్ ఇచ్చింది కస్తూరి.. ‘శౌర్య మాట్లాడతాడు అంట..” అంటూ.