జ్వాలా వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు ప్రజ్వల్ సూటిగా.. అతడి చూపులకి ఏమాత్రం తడబడకుండా..
“ఇండియన్ సైబర్ గోస్ట్ సర్వీస్ (ICGS) నుండి మీకు ఆర్డర్స్ వచ్చాయి.. నా రీసెర్చ్ డేటా ఎంత ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ అనేది గవర్నమెంట్‌కి తెలుసు, అందుకే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని అండర్ కవర్ లో మాపై నిఘా పెట్టమన్నారు.. అని చెప్తుంది
ఇన్ఫాక్ట్ మీకు ఈ మిషన్ ని ఇచ్చింది కూడా మేమే.. బట్ మిమ్మల్ని మాత్రం డిపార్ట్మెంట్ నే చూజ్ చేసింది..
మీరు మాకు ప్రొటెక్షన్ గా ఉన్నారో లేదో చెక్ చేయడానికి అని నేను, కావ్య ముందు నుండే అన్ని అబ్సర్వ్ చేస్తూనే వున్నాం..
మీ ప్రతి మూవ్ మాకు తెలుసు.. అని అంటూ రాహుల్ వైపు చూసి.. మీరు సీక్రెట్ గా కావ్య బ్యాగ్ కి మైక్ పెట్టి మా మాటలు వినడం మాకు తెలుసు..
అందుకే కదా అది రోజు తన బ్యాగ్ లివింగ్ ఏరియా లో సిగ్నల్ వీక్ గా వుండే ఒక మూలలో ఆ బ్యాగ్ ని పెడుతుంది అని అంటూ..