ఆ శత్రుత్వాన్ని కూడా దాటి నీ మెడలో వాడు తాళి కట్టి జీవితకాలం తనతో ఉంచుకోవాలి అనుకుంటున్నాడు అంటే ఇంకా ఏదో బలమైన కారణమే ఉంది.. ఇప్పుడు ఒక ఆడదానిగా చెప్తున్నాను ఆ కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించు.
ఆ తర్వాత నిర్ణయించుకో నీ జీవితంలో ఏది ముఖ్యం అనేది.. అని వసుమతి ఎటువంటి కోపం చూపకుండా చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పారు.