అప్పటికే ఒళ్ళు పులుసి పోయి సన్నగా పాదాలు నుంచి మెలి పెట్టినట్టు నొప్పి లాగుతున్న ఈసారి అర్జున్ కి చెప్పలేదు.
కాళ్లు తీసుకుని తీసుకొని నడుస్తున్న తన పరిస్థితికి నెమ్మదిగా నడుస్తూనే ఇద్దరు విష్ణు ఉన్న దగ్గరికి రావడంతో అక్కడి నుంచి ఆటో మాట్లాడి సరుకులతో పాటు మేఘ ను కూడా ఎక్కించాడు.
సరుకుల వలన ఒక పక్కకు ముడుచుకొని కూర్చుని వడిలిపోయిన ముఖంతో ఇద్దర్ని చూస్తుంటే నువ్వు కూడా వెళ్ళు అన్నాడు విష్ణుతో.
మనం ఇంకో ఆటో కి వెళ్దాం అని విష్ణు అంటుంటే నాకు ఇంకో రెండు గంటలు ఇక్కడే పని ఉంది, ఒక పార్టీని కూడా కలవాలి నువ్వు వెళ్ళు అని డ్రైవర్ పక్కన ప్లేస్ చూపించడంతో ఇక ఆర్గ్యు చేయలేదు విష్ణు.