మళ్ళీ అతనే మాట్లాడుతూ అవునురా వాడు నాకు క్లాస్ లు పీకుతుంటే అది నాకు నచ్చక నేను వాడికి దూరంగా ఉండేవాడిని…
అలా ఒకరోజు నేను కాలేజ్ లో ఒక అమ్మాయిని బలవంతంగా లొంగదిసుకోపోతుంటే ఎక్కడ నుండీ వచ్చాడో గాని క్రిష్ ఆ ప్లేస్ కి వచ్చాడు…
అమ్మాయిని పట్టుకుని లాగుతున్న నన్ను, ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి కోపంతో దవడ కండరాలు బిగించి రుద్ర కాలుడే అయ్యాడు….
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల యముడిలా నా మీద విరుచుకుపడ్డాడు….నన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి,ఏ కీలుకి ఆ కీలు విరిచేసి,ఆ అమ్మాయి చేత నా మొహం మీద ఉమ్ము ఊయించి,తన ఎడమ కాలి చెప్పుతో నా రెండు చెంపలు వాయించేలా చేసి,తరువాత తనని అక్కడ నుండి పంపించ్చేసి ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి అయిన వెళ్లావని తెలిస్తే ఇప్పటిలా చితక్కొట్టి వదిలేయను..
ఈ సారి సంసారానికి పనికిరాకుండా దాన్ని కోసి పారేస్తాను అని నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి నన్ను అవమానించి వెళ్ళాడు….