New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 21

కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 21

అర్జున్‌ను చూస్తున్న వైదేహి కళ్లల్లో కూడా తెలియకుండానే కన్నీళ్లు చేరిపోతాయి.

కొంత సమయం తర్వాత వైదేహి మాట్లాడుతూ…

 

“నా మొదటి కండిషన్ ఏంటంటే, ఈ పెళ్లికి అభిమన్యు గారు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి.

 

రెండవది, నాకు అమ్మానాన్న లేరు. ఒక కారు ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. వాళ్లు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నన్ను చిన్నప్పటినుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ, తమ ప్రాణం పెట్టి తాతయ్య, నానమ్మ పెంచారు.

 

అలాంటి వాళ్లు మొదటిసారి నన్ను ఒకటి అడిగారు. నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం చూడాలన్నదే వాళ్ల ఆశ. అందుకే ఈ పెళ్లికి వాళ్లు కూడా ఒప్పుకోవాలి. వాళ్లు దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి.

 

ఇక మూడవది, నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగించాలని అనుకుంటున్నాను.

 

ఆఫీసులో ఎవరికీ నేను అభిమన్యు గారి భార్యనని తెలియకూడదు. నేను ఇప్పుడు ఎలా అయితే పని చేసుకుంటున్నానో, పెళ్లి తర్వాత కూడా అలాగే చేసుకుంటాను.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue