అలా ఈ పెద్దావిడ దగ్గర ఇంటి మనిషిగా ఉండిపోయాడు.. కానీ..! ఎవరు కూడా వరుస పెట్టి పిలవలేదు.
ఆ ఇంట్లో వాళ్ళనే తన వాళ్ళు అనుకున్నాడు శేఖర్ గారు.. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా వరుసలు పెట్టి పిలవలేదు ఒక్క ఈ పెద్దావిడ అన్నయ్య అనడం తప్పించి.. ఇదే మొదటిసారి తనతో ఎలాంటి పరిచయం లేకుండా ఒక అమ్మాయి బాబాయ్ అని పిలవడం.
రోజా వైపు ఆప్యాయంగా చూసి ఇద్దరి లగేజ్ లు తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాడు శేఖర్.
రోజా చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకువచ్చింది ఆ పెద్దావిడ.
పెద్ద బంగ్లాలా ఉన్న ఆ ఇంటిని చూస్తూ ఏదో గుళ్లో ఉన్నటువంటి గడపలాగ ఉన్న ఆ పెద్ద గడపని చూస్తూ కుడి కాలు లోపలకి పెట్టింది కళ్ళు పెద్దగా చేసుకొని చుట్టూ అంతా పరికించి చూస్తూ రోజా.