🌸 🕊️ నా రాక్షసి వే -14🌸 🕊️
కార్తి చిన్నితో పాటు అంకిత కోసం కూడా షాపింగ్ చేస్తాడు అని తెలుసు కాబట్టి..
తను కూడా మళ్ళీ సెపరేట్ గా ఇద్దరి కోసం వేర్వేరుగా షాపింగ్ ఎంపిక చేయడం ఎందుకనీ,
అసలు తనకు షాపింగ్ చేయడం కూడా అంతగా రాదనీ ఆలోచిస్తు.. మెయిల్స్ చెక్ చేయడంలో మునిగిపోతాడు దేవ్!
ఒకవేళ తాను సెలెక్ట్ చేసింది వాళ్లకు నచ్చుతుందో లేదోనన్న సందేహంతో, చివరికి తన పనులకే పరిమితమై ఎవరినీ, దేనిని పట్టించుకోకుండా ఉంటాడు..
దేవ్ స్వభావం, అతడి ఆలోచనా విధానం బాగా తెలిసిన కార్తి, తానే స్వయంగా చిన్నికి, అంకితకి కావలసినవన్నీ షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటాడు.