మ్యాగ్నెటిక్ వాయిస్ తో ప్రదీప్ చెప్పిన దానిలో నిజం ఎంత ఉందో తెలిసిన రమ్య తల వెనక్కి తిప్పి కళ్ళు తెరిచి ఫస్ట్ అతని ముఖం చూసింది.
కొన్ని క్షణాలు ఆ చూపులకి కరిగిపోయిన ప్రదీప్ తేరుకుంటూ ఇందుకేనే నిన్ను తింగరి అనేది అని ముద్దుగా కసిరి ముందుకి తల తిప్పడంతో విద్యుత్ దీపాలతో అలంకరించిన జి ప్లస్ వన్ హౌస్ కళ్ళ ముందు మిరుమిట్లు గొలుపుతో కనిపించింది.
ఇంకా ఏదో అని ఊహించుకున్న రమ్య కళ్ళ ముందు ఇల్లు కనిపిస్తుంటే.. ఎవరి ఫంక్షన్ ప్రదీప్?? అని నార్మల్ గా అడిగింది.
ఆన్సర్ చెప్పలేదు ప్రదీప్ తన చెయ్యి పట్టుకొని ఇంటి గేట్ దగ్గరికి తీసుకెళ్లి గోడ మీద ఉన్న నేమ్ బోర్డ్ వైపు చేత్తో చూపించాడు.