ఎపిసోడ్24
అప్పటివరకు తన ఆలోచనల్లో తను మునిగి ఉన్న విజె ఒక్కసారి ఈ లోకం లోకొచ్చాడు.
కారు ఏయిర్ పోర్ట్ వైపు వెళ్ళడం చూసి అయోమయంలో పడింది స్వప్నిక.
ఇదేంటి, ఏర్ పోర్ట్ వైపు వెళుతున్నాడని కంగారు పడింది స్వప్నిక.
“విజె, ఇటెక్కడికి? ఏర్ పోర్ట్ వైపు ఎందుకు?” అని భయంగా అడిగింది.
అప్పుడు వ్యూ మిర్రర్ పై విజె దృష్టి పడింది. మిలమిలా మెరుస్తూ కొంచెం ఎర్రబారిన కాటుక కళ్ళు కనిపించగానే ఒక్కసారి అతని గుండె లయ తప్పింది.
ఆమెను చూసిన క్షణం అతనిలో చిలిపితనం ఒళ్ళు విరుచుకుంది.