ఎపిసోడ్45
స్వప్నిక వొద్దన్నా కూడా ఆమెను చాలా చక్కగా ముస్తాబు చేసి పాలగ్లాసు ఇచ్చి పంపించింది సీతాలు.
“ఇవ్వన్నీ ఎందుకు? సీతాలు” నోటిదాకా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయని ఊరుకుంది.
గదిలోకి వెళ్ళిన స్వప్నిక అది తన బెడ్ రూమా లేక ఏదైనా కొత్తలోకం లోకి వచ్చానా అని ఆశ్చర్యపోయింది.
ఎదురుగా పూల పానుపు మీద తెల్లని ధోవతిలో పైన ఏమీ లేకుండా దిండుకొరిగి తన ఫొన్ లో ఏదో చూస్తున్నాడు.
పచ్చని పసిమి ఛాయతో స్వర్గలోకం నుండి దిగి వొచ్చిన దేవేంద్రుడిలా మెరిసిపోతున్నాడు.