New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 46

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 46

ఎపిసోడ్ 46

 

“సీతాలు  ఎవరో వొచ్చారని చెప్పగానే స్వప్నిక అతనెవరో ఊహించింది. ఇంతకు ముందు భయపడ్డ సీతాలు ఈ రోజు ధైర్యంగా వెళ్లింది. తరువాత ఏమైందో ఇప్పుడు చుద్దాం.

 

ఒక అరగంట తరువాత విజె స్వప్నిక హాల్లోకి వొచ్చారు. 

“సీతాలు, బ్రేక్ ఫాస్ట్ రెడీ అయ్యిందా?” అని అడిగింది స్వప్నిక.

 

“ఆ..అయింది తల్లి. అల్లుడు బాబూ!  వొచ్చేయండి. మీకూ ఇడ్లీ, కారం, మంచి నెయ్యి ఇష్టమని అమ్మాయి చెప్పింది.” అని సంతోషంగా పిలిచింది సీతాలు.

 

“స్వప్నీ, బయటెవరో వొచ్చారని చెప్పిందిగా, వెళ్ళి ఒకసారి పలకరించిరా, అంత వరకు నేను వెయిట్ చేస్తాను.” అని అన్నాడు విజె.

 

తనకు తెలుసు. వొచ్చింది ఆ రోగ్, భరత్ గాడని. వాడి నుండి తప్పించుకోవాలంటె, విజెతో చాలా ఫ్రీగా  మూవ్ అవ్వాలి. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue