ఎపిసోడ్ 51
స్వప్నిక అన్న మాటలకు ఆమె చెంప ఛెల్లుమనిపించడానికి చెయ్యి లేపింది లాస్య.
తరువాత ఏమయిందో ఇప్పుడు చూద్దాం.
వెంటనే లాస్య చేతిని గాల్లోనే గట్టిగా పట్టుకుంది స్వప్నిక. అది చూసి అందరూ గబ గబా ఆ క్యాబిన్ లోకి వచ్చారు. డోర్స్ ఓపెన్ గ ఉంచారు.
“అవును ఊరుకొక్కదాన్ని అని అంటున్నారు కదా, ప్యారిస్ లో మిమ్మల్ని మేంటేన్ చేసారా అని అడిగాను. ఇందులో తప్పేముంది?
విజె నన్ను మేంటెన్ చేయడం కాదు, పెళ్ళి చేసుకున్నారు. మీకూ నాకూ తేడా ఏంటో తెలియటం లేదా?” నిదానంగా అడిగింది స్వప్నిక.
“ఎంత పొగరు నీకు? నేను జీతం ఇస్తే కాని బతక లేవు.” ఇంకా ఏదో అనబోయింది లాస్య. దానికి మధ్య లోనే ఆమెను ఆపింది స్వప్నిక.