ఎపిసోడ్ 59
స్వప్నిక తన మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ని స్పర్షతో తెలియజేసిందని అతనికి అర్థమైంది.
తనను చుట్టి పడేసిన ఆ చేతులను అలాగే పట్టుకుని ఆమె వైపు తిరిగాడు విజె.
“ఏమైంది, స్వప్నీ?” అడిగాడు విజె. అతని మాటలు అతనికే కొత్తగా వినిపించాయి.
“ఈ రోజు.. ఈరోజు మీరు చేసిన పనికి నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు విజె.” తల దించుకుని అంది స్వప్నిక.
తన చూపుడు వేలితో ఆమె చుబుకాన్ని (గడ్డాన్ని) పట్టుకుని లేపాడు విజె.