ఎపిసోడ్ 98
“ఏంటి నావల్ల తడిచారా? నేనేమన్నా మిమ్మల్ని వర్షం లోకి లాగానా ఏంటి? అన్ని మీరే చేసి సీతాలు ముందు నన్ను దొంగను చేస్తున్నారు” అని కోపంగా అంది స్వప్నిక.
“సరే ఏం చేస్తాం.. నువ్వు రాయనంటున్నావ్ కదా. నాకు రాసుకోవడం రాదు.. కాబట్టి సీతాలుని రాయమంటాను.
.పెళ్ళాం ఉండి కూడా.. వేరే వాళ్ళతో తప్పడం లేదు మరి..” అని బుంగమూతి పెట్టుకున్నాడు విజె..
ఇంతలో టీ ఫ్లాస్క్ కప్పులు పట్టుకుని వొచ్చిన సీతాలు..
స్వప్నిక చేతిలో ఆ బామ్ ని చూసింది..
“నేను చెప్పలేదా? అల్లుడు బాబు, మా అమ్మాయికి అన్నీ తెలుసు.” అని చిన్నగా నవ్వింది సీతాలు..