New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పరవశం – 5
పరవశం 4 min read

పరవశం – 5

​”ఇప్పుడు చెప్పు అత్తా, ఏంటి విషయాలు?” అని అడుగుతుంది మేఘ.. కిచెన్ గట్టు మీద కూర్చుని..

 

​”ఏముంటాయి.. అన్నీ మామూలే..” అని అంటారు ఆవిడ..

 

​”సర్లే, నువ్వు ఒక్కదానివే వచ్చావు.. లిల్లీ అక్క లేదా ఇంటిదగ్గర?” అని అడుగుతుంది మేఘ..

 

​”లేదురా! మీ బావ ఫ్రెండ్ ఎవరిదో మ్యారేజ్ ఉందంట.. గిఫ్ట్ కొనాలని షాపింగ్‌కి వెళ్తే.. నేను కూడా లిల్లీని వెళ్లమని చెప్పాను..

​ఇద్దరూ కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని.. అసలే ఈ మధ్య మీ బావకి ఆఫీస్ వర్క్ ఎక్కువ అవుతుందంట, కొంచెం లేట్‌గా ఇంటికి వస్తున్నాడు,” అని అంటారు ఆవిడ..

 

​”ఓహో అవునా! సర్లే మంచిపని చేశావు.. షాపింగ్ అవ్వగానే ఇటు రమ్మని చెప్పాల్సింది,” అని అంటుంది మేఘ..

 

​”నేను చెప్పాల్సిన అవసరం లేదులే, వాడే వచ్చేస్తాడు చూడు,” అని అంటారు భవానీ గారు నవ్వుతూ..

 

​”ఇప్పుడు వద్దులేమ్మా అని అంటే అలా కాదు అత్తా.. నేను అక్కకి చెప్పాలే, ఇక్కడికి వచ్చినప్పుడు నా చేతి వంట రుచి చూపిస్తా అని.. ఇప్పుడు ఎలాగో వస్తారు కదా! ​అయినా బావకి బయట ఫుడ్ పడదు కదా! వాళ్ళు అర్థం చేసుకుంటారులే,” అని అంటుంది మేఘ..

 

​”సరే, నీకు నచ్చింది చెయ్యి,” అని అంటారు.. తరువాత వంట చేస్తూ ఇంకా ఇద్దరూ కూడా మాటల్లో పడిపోతారు..

​చైన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది అని విజ్జు చెప్పగానే.. విక్రమ్ కళ్ళు తెరిచి విజ్జు వైపు చూస్తాడు..

 

​”నువ్వు చెప్పేది నిజమా?” అని అడుగుతాడు..

 

​”అవును బావ, ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది,” అని అంటాడు..

 

​”కానీ ఇంతకుముందు కార్‌లో దాని గురించి ఏమీ తెలియలేదు అని చెప్పావు కదా!” అని అడుగుతాడు విక్రమ్..

 

​”అప్పుడు నిజమే బావ.. అప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.. కానీ ఒక వన్ అవర్ ముందు నాకు మనం పెట్టిన మనుషుల నుంచి కాల్ వచ్చింది..

 

​అది చాలా పాతకాలం చైన్ అవ్వటంతో దాని గురించి తెలియదు అనుకున్నాం.. కానీ ఒక ఓల్డ్ జ్యువెలరీ షాప్‌లో దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది.. ​ఆ చైన్ ఎవరో కావాలని వాళ్ళే డిజైన్ చేసి అలా తయారు చేయమని వాళ్ళకి చెప్పారు అంట.. ​అందుకే వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపట్టారు.. అంతకన్నా వాళ్ళు డిజైన్ చేసిన ప్రతి గోల్డ్ వస్తువు మీద వాళ్ళ లోగో నేమ్ ఉంటుందంట షార్ట్‌కట్‌లో…

 

​ఇప్పుడు నిన్ను వీకేఆర్ అని ఎలా పిలుస్తారో.. అలా వాళ్ళ డిజైన్ మీద చిన్నగా వాళ్ళ లోగో నేమ్ ఉందంట చిన్నగా.. దాన్ని చూసి వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపట్టారు,” అని అంటాడు విజ్జు..

 

​”అడ్రస్ తెలిసిందా?” అని అడుగుతాడు విక్రమ్…

 

​”హ్మ్.. తెలిసింది.. కానీ అది ఎప్పుడో పాత అడ్రస్ కదా! వాళ్ళు అక్కడ ఉంటున్నారో లేదో..” అని విజ్జుంటూ ఉండగానే..

 

​”అడ్రస్ చెప్పు,” అని అడుగుతాడు విక్రమ్..

 

​”బావా, పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియలేదుగా,” అని అనగానే..

 

​”అదంతా వద్దు, నాకు అడ్రస్ చెప్పు,” అని విక్రమ్ సీరియస్‌గా అనగానే..

 

​విజ్జు అడ్రస్ చెప్తాడు.. “సరే నేను వెళ్తున్నా.. నువ్వు ఇంటికి వచ్చిన 

 

వాళ్ళ సంగతి పూర్తిగా తెలుసుకో,” అని అంటాడు విక్రమ్ కార్ కీస్ తీసుకుంటూ..

 

​”బావా, నేను నీతో వస్తా,” అని విజ్జు అనగానే, విజ్జు వైపు ఒకసారి చూసి “సరే పదా!” అని ఫాస్ట్ గా కిందకి వస్తాడు..

 

​హాల్ లో ఉన్న జయ గారి వైపు చూసి, “నానమ్మా నాకు చిన్న వర్క్ ఉంది.. చూసుకుని వస్తాను.. నువ్వు డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు,” అని చెప్పి, ఒకసారి అక్కడ ఉన్న మెయిడ్‌కి ‘జాగ్రత్త’ అని సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

 

​జయ గారు విక్రమ్‌ని పిలిచేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

 

​వెనకాలే వచ్చిన విజ్జుని చూసి, “రేయ్! ఇంత అర్జెంట్‌గా ఎక్కడికిరా?” అని అడుగుతారు కొంచెం సీరియస్‌గా జయ గారు..

 

​”అర్జెంట్ వర్క్ అమ్మమ్మా, కచ్చితంగా వెళ్ళాలి..” అని, పక్కనే ఉన్న వాళ్ళని చూసి, “సారీ,” అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు విజ్జు అక్కడి నుంచి..

 

​వెళ్తున్న ఇద్దరి వైపు చూసి, మళ్ళీ వీళ్ళ వైపు చూసి, “క్షమించండి.. ఏదైనా అర్జెంట్ అనుకుంటా, అందుకే వెళ్తున్నారు,” అని అంటారు..

 

​”అయ్యో, ఇట్స్ ఓకే అండి.. ఏమీ పర్లేదు,” అని చిన్న స్మైల్ ఇస్తారు..

 

​దానితో జయ గారు కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు..

 

​విక్రమ్ కార్ స్టార్ట్ చేయగానే.. విజ్జు వచ్చి ఫాస్ట్ గా ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటాడు.. ​నిమిషాల్లో విక్రమ్ కార్ మ్యాన్షన్ దాటి వెళ్ళిపోతుంది… ​ఎందుకో విక్రమ్‌కి ఏదో ఎక్సైట్‌మెంట్.. ఇది అని చెప్పలేకపోతున్నాడు.. కార్‌ని చాలా స్పీడ్‌గా విజ్జు చెప్పిన అడ్రస్ వైపు తీసుకెళ్తున్నాడు…

 

​ఇక్కడ విజ్జు కార్ ఎక్కిన దగ్గర నుంచి ఫోన్ కాల్స్‌తో బిజీ అయ్యాడు.. అలాగే మరోవైపు విక్రమ్‌ని గమనిస్తూనే ఉన్నాడు…

​విక్రమ్ ఫేస్‌లో హ్యాపీనెస్ చూస్తుంటే విజ్జుకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.. అందుకే విక్రమ్‌ని డిస్టర్బ్ చేయకుండా తను చేయాల్సిన వర్క్స్ చేస్తున్నాడు…

 

​అప్పటికే చీకటి పడటంతో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది.. అది చూసి విక్రమ్‌కి పిచ్చి కోపం వస్తోంది.. ‘ఛా.. ఇప్పుడే సిగ్నల్ పడాలా!’ అని అనుకుంటూ ఉంటాడు..

 

​అది చూసి విజ్జు నవ్వుతూ, “అయ్యో బావా.. తప్పదు వెయిట్ చేయాలి.. అయినా ఇన్ని రోజులు వెయిట్ చేసినవాడివి, ఇప్పుడు వెయిట్ చేయలేవా!” అని అంటాడు నవ్వుతూ..

 

​విక్రమ్ ఏమీ మాట్లాడకుండా విజ్జు వైపు సీరియస్‌గా చూస్తాడు..

 

​”అబ్బా బావా, నువ్వు ఇలా సీరియస్‌గా చూస్తూ ఉంటే కష్టం బాబు.. నేను కాబట్టి నీ చూపుకి అర్థం గ్రహించగలను.. కానీ మరి మా చెల్లెలికి నువ్వు ఇలా ప్రతిదీ చూపులతో చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది.. చూసుకో మరి!”

 

​”నువ్వు సైలెంట్‌గా ఉంటావా.. లేక ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోనా?” అని అంటాడు విక్రమ్..

 

​”వద్దులే బాబు.. సైలెంట్‌గా ఉంటాను,” అని అంటాడు..

​గ్రీన్ సిగ్నల్ పడగానే విక్రమ్ ఫాస్ట్ గా అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు..

 

 

​ఇంకా ఉంది…