“వంట మొత్తం పూర్తి చేసి, అత్తా అన్నీ ఫినిష్!” అని అంటుంది మేఘా నవ్వుతూ..
“హ్మ్.. సరే అయితే నువ్వు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వు.. చూడు ఎలా అయ్యావో.. ఫేస్ అంతా చెమట పట్టేసి..
నేను ఈలోపు అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి ఫ్రెష్ అయ్యి వస్తాను,” అని అంటుంది భవాని..
“సరే..” అని అక్కడి నుంచి వెళ్తూ, “అవును ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడ? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు.. అది కూడా నువ్వు వచ్చావు అని తెలిసి!” అని అడుగుతుంది మేఘా..
“ఇక్కడ ఉన్నా బంగారం!” అంటూ చేతినిండా కవర్లతో లోపలికి అడుగుపెడుతున్న వాళ్ళ నాన్నని చూసి, “డాడీ..” అంటూ వెళ్ళి ఆయన్ని చుట్టేస్తుంది..
“నా బంగారు తల్లి!” అంటూ నుదిటిన ముద్దు పెట్టుకుంటారు..
“లవ్ యూ డాడీ..” అని నవ్వుతూ అంటుంది మేఘా..