అసలు నువ్వు ఇక్కడ ఉన్నవని తెలిసినట్టయితే నేను వచ్చేవాడినే కాదు…. నాది సేమ్ ఫీలింగ్ నువ్వు ఈరోజు వస్తున్నావని తెలిసుంటే కాలేజ్ కే వచ్చేదాన్ని కాదు అని చెప్పి తన ప్లేస్ లోకి వెళ్లి కూర్చుంది….
పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఏంటే ఆయన నీకు ఇంతకముందే తెలుసా అని అడిగింది…. హ అయితే అన్నట్టు చూసింది పరిచయం చెయ్యవే కొంచం చాలా బాగున్నాడు పైగా బిజినెస్ పర్సన్ అని అనింది ఎంతో ఆశ గా చూస్తూ ఏంటే పరిచయం చేసేది వాడంత వెధవ ఇంకొకడు లేడు….
ఫుల్ బాడీ అంతా పొగరే వాడికి అలాంటోడికి ఎంత దూరం గా ఉంటే అంత మంచిది అని చిన్నగా చెప్తూ ఉంది…. అర్జున్ కి వీళ్ళు మాట్లాడుకుంటుంది అంతా వినిపించదు కానీ గుస గుసగుసలు మాత్రం వినిపిస్తాయి హేయ్ జస్ట్ కీప్ షట్ యువర్ మౌత్ నేనిక్కడ ఒకపక్క ఎక్సప్లయిన్ చేస్తున్న కదా మళ్ళీ ఏంటి నీ కాకి గోల అన్నాడు….