New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 1

నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 1

 

నా మనసు దోచిన అతిధి రాక్షస్ [😈 🖤]

 

 

ఆర్య నీకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఇష్టమే గా అడిగింది వాళ్ళ అమ్మ గారు అయిన మానస 

 

ఆ అతిలోక సుందరుడు క్షణం ఆగి మీ ఇష్టం మామ్ 

అన్నాడు క్యాజువల్ గా ఆర్ యు ష్యూర్ ఆర్య 

 

అతని పొడుగాటి వేళ్ళు మ్యాక్ బుక్ పై టక టక లాడిస్తూనే హ్మ్ ఒన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు 

 

ఓకే డాడ్ తో మాట్లాడుతా మార్నింగ్ వెళుతున్నాం సరేనా 

 

మామ్ మీ ఇష్టం అన్నాగా మీరు చూసి వస్తే పోయేదానికి నేను అవసరమా పెద్ద అభిప్రాయం కానీ 

అదేం పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు 

 

ప్చ్ ఆర్య దిస్ ఈజ్ యువర్ లైఫ్ ఎందులో డిసప్పాయింట్ వద్దు తను మనకు తెలిసినా ఒక సారి అందరం వెళ్ళడం ఫార్మల్ 

 

ఓకే మామ్ యు గో అండ్ స్లీప్ 

 

యుటూ నాన్న టైం ఇస్ ఓవర్ 

 

లైట్ స్మైల్ ఇచ్చి ఐనొ స్మాల్ వర్క్ ఫినిష్ చేసి పడుకుంటా 

 

ఆవిడ..తన కొడుకు పని కీచుడని తెలిసి నిట్టూర్పు విడిచి వెళ్ళిందిక 

 

***************************

 

ఎందుకు వచ్చావే అరిచింది ఆవిడ !!

 

ఆ తేనె కళ్ళ సుందరి ముద్దు ముఖం చుట్టి పెళ్లి చూపులకి అంది 

 

వాళ్ళ అమ్మ అయినా జానకి గారు ఎర్రబడిన మొహం తో పిలిచామా నిన్ను చదువు పక్కనపెట్టి రమ్మని చెప్పామా

 

ఆ అమ్మాయి కళ్ళు రెడింతలు చేసి చూస్తూ వాళ్ళ నాన్న వైపు చూసింది ఏడుపు మొహం తో 

 

ఊరుకో జానకి చిన్నపిల్ల ఏదో ముచ్చట పడి వస్తే గుమ్మం దగ్గరే ఏంటీ వెళ్ళగొట్ఠుడూ గదిమాడు రామారావు ఆ అమ్మాయి తండ్రి 

 

ఇదా చిన్నపిల్ల అన్నట్టు వాళ్ళ అమ్మ ఎగా దిగా చూస్తే 

 

చూడండి నాన్న మీ ఆవిడ నన్ను ఎలా చూస్తుందో 

ఎంతో ఆశగా ఆరాటంగా వస్తే నన్ను పట్టుకుని సినిమాల్లో లాగా ఎలా ఉన్నావే బాగా చిక్కావు

 

తింటున్నావా రా తల్లీ ఎప్పుడు తిన్నావో ఏంటో అని ప్రేమ చూపించకుండా గరుడ పురాణం మొదలు పెట్టింది రాగం అందుకుని నటించకుండా ఏకంగా జీవించేస్తుంది తను 

 

అమ్మనీ కడుపు మాడా అక్కడ మా తమ్ముడు ఇంట్లో చక్కా ఉంటూ పైగా హాస్టల్ లో ఉన్నట్టు ఫోజు కొడతావా

 

మూలన ఉన్న చీపురు తీసింది ఆవిడ !!

 

అయ్ బాబోయ్ జానకీ మాతా శాంతం శాంతం ప్రశాంతం సేవ్ మి డాడీ పరుగందుకుంది ఆ 19 ఏళ్ల పసిడి పరువాలను పూసుకున్న అందమైన అమ్మాయి 

 

అప్పుడే బయట కార్ ఆగింది తను గేట్ వైపు పరుగు పెట్టి వాళ్ళమ్మకి నీ పని చెప్తా ఉండని వెక్కిరిస్తూ గేట్ తీసుకుని వస్తున్న ఇంకో అమ్మాయి ని 

 

అమాంతం చుట్టేసింది!!

 

తనని చుట్టుకున్న చేతులు చూసి నవ్వుతూ ఎప్పుడు వచ్చావే అంది తను 

 

అది మా అక్కంటే నువ్వు ఉన్నావు అడిగావా ఇలా 

వాళ్ళమ్మని చూసి వ్వె వ్వె అంటూ సాగదీసింది 

 

ఇప్పుడే వచ్చాను అక్క కానీ అమ్మ చూడు వచ్చి రాగానే నాతో ఫైరింగ్ వార్ స్టార్ట్ చేసింది నువ్వైనా చెప్పు కాలేజ్ లీవ్స్ కదా అందుకే ఎంచక్కా పెళ్లి చూపులు దగ్గరుండి చూసి పోదామని వచ్చా కానీ 

 

నన్ను భూమ్మీదకు తెచ్చిన నా తల్లే ఇలా అటుందే

అయ్యో హతవిధీ ఎం చేసేది ఎలా ఆపేది ఈ గోరం 

 

డ్రామా ట్రిక్ గా అంటుంటే ఈ సారి చీపురు పడేసి పక్కనే ఉన్న మాప్ కర్ర చేత బుచ్చుకొని మీదకొచ్చింది సేవ్ మి సిస్టర్ సంపేస్తాది మాతా శ్రీ అంటూ తన అక్క వెనక దాక్కుంటూ వాళ్ళ అమ్మ నుంచి తప్పించుకుని తిరుగుతోంది ఆ అమ్మాయి 

 

వెంటబడి వెంటబడి అలసిన జానకి గారు ఏమే 

ఎందుకే ఇలా తిప్పలు పెడతావు రా ఇటు 

 

అబ్బా ఆశ దోశ నేను అటొస్తే పట్టేద్దామనే ఆ పప్పులేం ఉడకవు మాతాజీ గారు నడుం మీద చేతులు వేసి జుట్టు ఎగరేస్తూ అంటుంది 

 

ఔను అక్కా కొంచెం నా బాగ్ లో ఫోన్ ఉంది ఇవ్వవూ

తలగోక్కుంటూ అడిగింది 

 

వాళ్ళ అక్క తలకొట్టుకుని ఈ టైం లో ఇక్కడ రచ్చ చేస్తూ ఫోన్ లు అందివ్వ మంటావా ఏం టైం లో ఏం చెయ్యాలో తెలీదేమే నీకు 

 

అదిగో ఆ..అంటూ మళ్ళీ రాగం అందుకుని మీ ఎవ్వరికీ నేనంటే ఇష్టం లేదు విసుక్కుంటున్నారు నేను పోతా 

 

నాన్న రండీ నన్ను దింపేయండి నేను అత్త దగ్గరకు పోతా రాగాన్ని వాళ్ళ నాన్న వినాలని మరి కాస్త సాగదీసింది తను !!

 

నేను డ్రామా క్వీన్ మాదిరి ముందుకు ఒక అడుగు వేసా అబ్బా ఎవరు ఆపరేం అంటే నిజంగానే వెళ్ళిపొమ్మని వదిలేసారా కంగారు పట్టుకుంది నాకు 

 

సాహి చెవిలో అమృతం పోసినట్టు గొంతులోకి గులాబ్ జామ్ గుటుక్కున వేసి మీంగినట్టు పిలిచింది మా అక్క శాన్విక అబ్బా రక్షించావు తల్లి అనుకుంటూ 

 

స్లో మోషన్ లో తిరిగా !!

 

లోపలికి పదా అర్థరాత్రి ఏంటీ ఆటలు అంది 

 

ఎస్ ఇంకో రెండు సార్లు అలాంటి డైలాగ్ లే కొట్టవే

వచ్చేస్తా లోపలే అనుకుని పైకి మాత్రం వద్దులే అక్క అమ్మ ఆపలేదంటే వెళ్లి పోమ్మనే కదా నే పోతాలే రండి నాన్న 

 

 

కంటిన్యూడ్ 💝 

 

 

ప్లీజ్ కామెంట్స్