అలా అయితే ఇంకా మంచిది అనింది…. హేయ్ నేను నీతో మాట్లాడలేదు నోరు మూసుకొని ఉండు చూడు సాగర్ నేను అయితే రాను వాళ్ళ ఫ్యామిలీ వస్తే మా ఫ్యామిలీ రాదు నీకు ఏ ఫ్యామిలీ కావాలో డిసైడ్ చేసుకో నేనా అదా ఎవరో తేల్చుకొని చెప్పు అని వెళ్ళిపోయాడు….
ఆ మాటలకి సాగర్ తరుణ్ ఇద్దరు కూడా బాధ పడుతూ చూస్తూ ఉన్నారు….. ఇలా చూడు అన్నయ్య నేను వాడిలా కాదు బంధాలు వాటి విలువలు నాకు బాగా తెలుసు వాళ్ళు వచ్చిన రాకపోయినా మేము రాము అలా అని మీతో శాశ్వతం గా విడిపోతాం అని కూడా అనుకోకు జస్ట్ ఇద్దరం ఒకేసారి రాము అంతే సరేనా అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది….
సాగర్ తరుణ్ అయితే తల పట్టుకు కూర్చున్నారు ఇద్దరి దెబ్బకి అందరు వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ ఉన్నారు…. అర్జున్ ఫోన్ మాట్లాడుతూ కారిడోర్ లో నుంచున్నాడు…. అన్విత చిరాకు గా బయటకు వస్తూ చూసుకోక అర్జున్ కి డాష్ ఇచ్చి పడిపోతు ఉండగా….