రుద్ర ఊహలలో మునిగి తేలుతున్న దియా కి డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఆ టైమ్ లో ఎవరో తెలియక అడుగు లో అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఐ హోల్ నుండి బయటకు చూస్తుంది…అక్కడ నలుగురు రౌడీ లు మాస్క్ వేసుకుని కనిపిస్తారు.
నలుగురినీ చూసిన దియా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. వాళ్లలో ఒకడు “రేయ్ ఇదేనా మనం వెతికే అమ్మాయి ఇల్లు ?? తలుపు తీయట్లేదు ఎవరూ?? ” అన్నాడు.
” ఇదే రా ఆ డాక్టర్ ఇల్లు ” అని చెప్పాడు.
వాళ్ళ మాటలు వింటున్న దియాకి మెల్లిగా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి.
వాళ్ళు ఆపకుండా మళ్ళీ డోర్ కొడుతున్నారు…దియా కి కంగారు గా ఉంది. మెల్లగా తన అడుగులు వెనక్కి పడుతున్నాయి. వెంటనే తనకి రుద్ర గుర్తొచ్చాడు… గబగబా తన గదిలోకి వెళ్ళి రుద్ర కి కాల్ చేసింది. కానీ రుద్ర కాల్ లిఫ్ట్ చేయలేదు. ‘ ఓహ్ గాడ్ … కామన్ రుద్ర ..పిక్ అప్ ది కాల్ …’ అని మళ్ళీ ట్రై చేస్తున్న అతను లిఫ్ట్ చేయట్లేదు. దియా కి టెన్షన్ పెరిగి తన గుండె చప్పుడు తనకే వినపడుతుంది…ఇంతలో మళ్ళీ బయట నుండి ఒక్కసారిగా బలమైన దెబ్బ పడింది.
దియా ఉలిక్కిపడి తన చేతిలోని ఫోన్ వదిలేసింది.