పెళ్లి చూపులు -59
అలా ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆఫీస్ కి రెడీ అయి బయటికి వచ్చారు అప్పటికే వైష్ణవ్ టిఫిన్ ప్రిపేర్ చేసి, తన రూమ్ లోనికి వచ్చేసి ఆఫీస్ కి రెడీ అయ్యి బయటకు వచ్చాడు
రవి ఎక్కడ అని వైష్ణవ్ ని అడిగింది.
కిచెన్లో ఉన్నాడు అని చెప్పటంతో సిరి నవ్వుతూ కిచెన్ లోపలికి వెళ్లి “ఏంటి రవి నేను విన్నది నిజమేనా..?” అని కన్నెగరేస్తూ అడిగింది.
రవి కూడా నవ్వుతూ అవును సిరి నిజమే, నేను రమ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అలానే మా పెళ్లి ఆగస్టులో నువ్వే దగ్గరుండి మరి మా పెళ్లి జరిపించాలి అని అన్నాడు.