పెళ్లి చూపులు -62
తన మనసులో ఉన్న ప్రేమని సిరి కి ఎలా చెప్పాలో అర్థం కాక తీకమక పడిపోతూ ఉన్నాడు వైష్ణవ్. ఎలా చెప్తే తను ఒప్పుకుంటుంది పెళ్లి చూపుల్లో నో అని చెప్పి తర్వాత ఎలా నన్ను ప్రేమిస్తున్నావ్ అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి.
ఆ రోజు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేక వెళ్లి ఈ సిరి రెడీ అయిన అవతారం, అంతకుమించి కనీసం తల కూడా ఎత్తకుండా అంతే తలదించి ఉన్న తనని చూసి చాలా బిడియం ఉన్న అమ్మాయి నలుగురిలో కలవలేదేమో అని అనుకుంటూ అమ్మతో నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పేసాను. అంతకుమించి సిరి డైరెక్ట్ గా నన్ను అడిగింది నేను మీకు నచ్చానా లేదా అని అప్పుడు కూడా లేదు అని తన ముఖం మీద చెప్పేశాను..
మరి అటువంటిప్పుడు ఇప్పుడు నా ప్రేమ విషయం చెప్తే తను యాక్సెప్ట్ చేస్తుందా..? ఎలా చెప్పాలి తనకి నా ప్రేమ విషయం అని పాపం తెగ ఫీలైపోతున్నాడు.
చిన్న సిచువేషన్ లో చూసిన సరే సిరి తన మనసులోనికి వచ్చేసి తనతో గిలిగింతలు పెడుతూ అల్లరి చేస్తూ ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఇంటిలో సిరి తిరుగుతూ అల్లరి చేస్తూ, రవి రమ్యతో ప్రేమికులు అడ్డంగా దొరికిపోతే ఎలా అయితే వాళ్ళని టీస్ చేస్తారు అలానే టీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆమె ఫేస్ లో కనిపించే ఆనందం చిన్న చిన్న వాటికి కూడా ఎగ్జిట్ మెంట్ గా ఫీల్ అవ్వటం చూస్తుంటే వైష్ణవ్ మనసు సిరి మీదకు మళ్లతూ ఉంది. క్షణం కూడా ఆమె మీద నుంచి పక్కకు తిరగటం లేదు.