నిత్విక్ ఆఫీస్ కి వెళ్ళడానికి అని రెడీ అవుతూ ఉంటాడు ఈ లోపు ప్రణతి నిత్విక్కి కావాల్సినవి అన్ని సద్దుతూ ఉంటుంది అలా సద్దుతున్న ప్రణతి ని మిర్రర్ లో నుంచి తల దువ్వుకుంటూ మధ్య మధ్యలో చూస్తూ ఉంటాడు….
అలా సడన్ గా వెనక నుంచి వచ్చి గట్టిగ పట్టుకొని వెనక నుంచే తలకి తల ఆనించి ఎందుకె నన్ను వదిలి వెళ్ళిపోయావు ఈ మూడు ఏళ్ళు ఎంత నరకం అనుభవించానో తెలుసా అందరు నువ్వు లేవు అనేవాళ్ళు కాని నా మనసు మాత్రం కచ్చితంగా నువ్వు బతికే ఉన్నావు అని చెప్తూనే ఉండేది….
నేను కూడా దాన్నే నమ్మాను ఎలా అంత కచ్చితంగా నమ్మనో నాకు అయితే తెలియదు కాని నీకు ఏమైనా అయిన మరు క్షణం నా గుండె కొట్టుకోవడం ఆ క్షణమే ఆగిపోయిద్ది…. నా గుండె చప్పుడు నువ్వే నా ప్రతి శ్వాస లో ఆణువణువూ నువ్వే ఉన్నావు రా…..
“అని నిత్విక్ మాట్లాడుతూ ఉండగా ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి వెంటనే వెనక్కి నిత్విక్ వైపు తిరిగి గట్టిగ హాగ్ చేసుకొని నన్ను క్షమించు బావా ఇంకెప్పుడు నిన్ను వదిలి పెట్టి వెళ్ళను నా ప్రాణం నువ్వే మన ఇద్దరి గుండె చప్పుళ్ళు ఒకటే అని ఆ రోజు నిన్ను చూసిన క్షణం నా ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది బావా అని చెప్తూ చెప్తూ ఒక విషయం గుర్తొచ్చి నిత్విక్కి కొంచెం దూరం జరిగి నుంచొని అవును నువ్వు అసలు నా మెడలో ఈ సూత్రం ఎప్పుడు వేశావు అని అడిగింది….