New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమే పునాదిగా 💖 – 9

ప్రేమే పునాదిగా 💖 – 9

అలా ఒకరోజు కాదు.. రోజూ ఆద్య వంట చేయడం, అర్జున్ బాలేదని ఆ వంట రుచి చూస్తే ఆకలి కూడా చచ్చిపోతుంది అని తిట్టి పక్కన పెట్టేయడం, ఆద్య ఏడ్చుకుంటూ ఆ నాలుగు ముద్దలు తినడం జరుగుతుంది..

 

ఒకరోజు ఈవెనింగ్ అర్జున్ ఇంట్లో ఉన్న టైమ్ లో కాలింగ్ బెల్ మోగగా అర్జున్ ఏ అప్పులోళ్ళు వచ్చారో ఏంటో అనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు… 

 

ఎదురుగ తన ఫ్రెండ్ సుమన్ నిలబడి ఉంటాడు… అతన్ని చూసి చిన్నగా నవ్వి నువ్వా సుమన్ హాయ్ రా ఏంటి చాలా రోజుల తరువాత గుర్తొచ్చాను రా లోపలకి అంటాడు…

 

లేదు నాకు అర్జెంటు వర్క్ ఉంది వెళ్ళాలి. బట్ నీకో విషయం చెపుదాం అని వచ్చాను ఇలా రా అంటూ అర్జున్ నీ తీసుకుని పక్కకి వెళ్లి ఒరేయ్ అర్జున్ నిజం చెప్పాలంటే నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెపుదాం అని నైట్ మీ ఇంటికి వచ్చాను అంటాడు సుమన్ …

 

ఓహ్ అవునా ఎప్పుడు అన్నట్టుగా అర్జున్ చూడగా అదే సార్ తమరు ఆద్య తో చాలా చెత్తగా బిహేవ్ చేస్తున్నప్పుడు అంటాడు సీరియస్ గా…..

 

ఆ మాటకి అర్జున్ మౌనం గా దిక్కులు చూస్తుంటాడు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue