New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 19

♥️బావ మరదలు♥️ – 19

ఇరు కుటుంబాల పెద్దలు ముందే మాట్లాడి, మరుసటి రోజు రాత్రికే హైదరాబాద్ ఫ్లాట్ లోనే వీళ్లిద్దరికీ “శోభనం ముహూర్తం” నిశ్చయించారు. జానకమ్మ ముందే ఫోన్ చేసి, “రూమ్ అంతా లక్ష్మి అత్తయ్య సర్దేసిందిరా, జాగ్రత్త” అని గట్టిగా చెప్పింది.  

 

ఆ ఫ్లాట్ లో ఎవరు లేరు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి పోయారు. కేవలం శివ పట్టుపట్టడం వల్ల శోభనం హైదరాబాద్ లో జరుగుతుంది.

 

 

రాత్రి పది గంటలవుతోంది. ఫ్లాట్‌లోని బెడ్‌రూమ్ అంతా తెల్లటి మల్లెపూల తోరణాలు, గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో గది అంతా ఒక కొత్త లోకంలా ముస్తాబై ఉంది. మంచం మధ్యలో వెండి గిన్నెలో కుంకుమ పువ్వు కలిపిన పాలు, పండ్ల గిన్నె ఉన్నాయి.

శివ వైట్ కుర్తా పైజామా వేసుకుని, గుండెల్లో తెలియని ఒక తీపి కంగారుతో గదిలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడూ ఆఫీస్ మీటింగులలో వందల మందిని శాసించే ఆ ప్రాజెక్ట్ మేనేజర్‌కు, ఈరోజు గదిలోకి వెళ్లడానికి కాళ్లు వణకుతున్నాయి.

 

గదిలో మంచం మీద సాహిత్య కూర్చుని ఉంది. తల నిండా మల్లెపూల జడ, ఎర్రటి పట్టుచీర, చేతులకు నిండుగా గాజులు వేసుకుని, తలదించుకుని ఉంది. ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే రౌడీయిజం మాయమై, ఒక ముచ్చటైన సిగ్గు కనిపిస్తోంది.

శివ నెమ్మదిగా వెళ్లి డోర్ లాక్ చేశాడు. ఆ శబ్దానికి సాహిత్య గుండె వేగం మరింత పెరిగింది. శివ నడుచుకుంటూ వచ్చి మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు.

“సాహిత్యా…” అన్నాడు చాలా సాఫ్ట్ వాయిస్‌తో.

సాహిత్య తల పైకెత్తకుండానే పక్కనే ఉన్న పాల గ్లాస్ అందుకుని శివ చేతికి ఇచ్చింది. “కాఫీ కాదు బావా… పాలు, తాగు” అంది చాలా సున్నితమైన గొంతుతో.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue