New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 5

♥️బావ మరదలు♥️ – 5

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, శివ ఒక ప్రైవేట్ టాక్సీ మాట్లాడుకుని సాహిత్యను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. హైవేపై జరిగిన ఆ భయంకరమైన యాక్సిడెంట్, ఆ తర్వాత వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ ఇద్దరి మనసుల్లోనూ ఒక తెలియని భయాన్ని నింపాయి. కానీ శివ బయటకు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. సాహిత్య గదికి చేరుకోగానే, ఆమెను లోపల దించి జాగ్రత్తలు చెప్పాడు.

“సాహిత్యా, నువ్వు రూమ్ డోర్ లాక్ చేసుకుని లోపలే ఉండు. అనవసరంగా బయటకు రాకు. కాలేజీకి వెళ్లేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్లొద్దు, నేను వచ్చి డ్రాప్ చేస్తాను. ఆ ఫోన్ కాల్ గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా” అన్నాడు శివ ఆమె భుజం తడుతూ.

సాహిత్య కళ్లలో ఇంకా ఆ భయం కనిపిస్తూనే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ రచ్చ చేసే సాహిత్య, ఈరోజు చాలా సైలెంట్‌గా అయిపోయింది. “జాగ్రత్త బావా, నీ తలకు దెబ్బ తగిలింది కదా, నువ్వు కూడా ఎక్కువ శ్రమపడకు” అంది ఆందోళనగా. శివ ఆమెకు ధైర్యం చెప్పి తన ఫ్లాట్‌కు వెళ్ళిపోయాడు.

 

 

అడుగుపెట్టాడు. తలకు వైట్ బ్యాండేజ్ ఉండటంతో టీమ్ మెంబర్స్ అందరూ కంగారుగా చుట్టూ చేరారు.

“ఏమైంది సార్? యాక్సిడెంటా?” అని అడిగారు.

“చిన్న ఇన్సిడెంట్ లేండి, నో ప్రాబ్లమ్” అంటూ శివ తన క్యాబిన్‌లోకి వెళ్లి కూర్చున్నాడు. అతను ఎంత సాఫ్ట్‌వేర్ మేనేజర్ అయినా, లోపల ఒక పక్కా పల్లెటూరి పట్టుదల ఉంది. తన మరదలి జోలికి వస్తే ఎవడైనా సరే వదిలిపెట్టే రకం కాదు.

శివ వెంటనే తన క్లోజ్ ఫ్రెండ్, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే విక్రమ్కు ఫోన్ చేశాడు. విక్రమ్ శివకు కాలేజ్ ఫ్రెండ్, హ్యాకింగ్ మరియు నెట్‌వర్క్ ట్రేసింగ్‌లో ఎక్స్‌పర్ట్.

విషయం వినగానే విక్రమ్ వెంటనే శివ ఆఫీస్‌కు వచ్చాడు. క్యాబిన్ డోర్ లాక్ చేసి ఇద్దరూ సీరియస్‌గా డిస్కషన్ మొదలుపెట్టారు.

“విక్రమ్! ఆ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాడు గోదావరి గట్టున ఉన్న మా వందెకరాల తోటల గురించి మాట్లాడాడు. ఆ తోటలు మా చేతుల్లోంచి పోతే వాళ్లకు లాభం. ఆ నంబర్ లొకేషన్ ఎక్కడో నువ్వు ట్రేస్ చేయాలి” అన్నాడు శివ తన ఫోన్ విక్రమ్‌కు ఇస్తూ.

విక్రమ్ తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, శివ ఫోన్ డేటాను కనెక్ట్ చేశాడు. కొద్దిసేపు కీబోర్డ్ మీద వేగంగా వేళ్లు కదిలించాక విక్రమ్ ముఖం సీరియస్‌గా మారింది.

 

 

శివా… ఈ కాల్ వచ్చింది సాధారణమైన సిమ్ కార్డ్ నుంచి కాదు. ఇది ఒక ‘వర్చువల్ నంబర్’ (VoIP). దీన్ని విదేశీ సర్వర్ల ద్వారా రూట్ చేశారు. కానీ, కాల్ కనెక్ట్ అయినప్పుడు సిగ్నల్ టవర్ జంపింగ్ చూస్తే… లోకల్ నెట్‌వర్క్ ఒకటి వాడారు. ఆ సిగ్నల్ లాస్ట్ లొకేషన్ ఎక్కడో తెలుసా? మన రామచంద్రపురం పక్కనే ఉన్న భీమవరం టౌన్ శివార్లలో!” అన్నాడు విక్రమ్ స్క్రీన్ చూపిస్తూ.

శివ ఆలోచనలో పడ్డాడు. “భీమవరం శివార్లంటే… అక్కడ మా ఊరి ప్రెసిడెంట్, అంటే మొన్న మా ఇంటికి వచ్చిన కిరణ్ వాళ్ల నాన్న వీరభద్రరావుకు పెద్ద క్వారీ బిజినెస్ ఉంది. పైగా ఆ వందెకరాల మామిడి తోటల గట్టును ఆనుకునే వీళ్ల క్వారీ భూములు ఉన్నాయి. ఒకవేళ మా తోటలు గవర్నమెంట్ పరమైతే, దాన్ని లీజుకు తీసుకోవాలని వీరభద్రరావు ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడని నాన్న ఒకసారి చెప్పారు!”

“అంటే… నీకు బెదిరింపు కాల్స్ పంపించింది, యాక్సిడెంట్ చేయించింది ఆ ప్రెసిడెంట్ వీరభద్రరావేనా?” అని అడిగాడు విక్రమ్.

“కచ్చితంగా వాడే అయ్యుంటాడు. కానీ వాడి వెనుక ఇంకా ఎవరో పెద్ద లీగల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఆ కోర్టు నోటీసు చాలా పక్కాగా ప్లాన్ చేసి పంపించారు. మనకు తెలియని థర్డ్ పార్టీ ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు” అన్నాడు శివ కళ్లు చిన్నవి చేస్తూ.

 

ఇదిలా ఉండగా, సాయంత్రం నాలుగు గంటలవుతోంది. సాహిత్య కాలేజీ అయిపోయి బయటకు వచ్చింది. శివ ఇంకా రాలేదు. ఆమె గేటు దగ్గర నిలబడి ఫోన్ కోసం వెతుకుతుండగా… ఒక నల్లటి స్కార్పియో కార్ ఆమె పక్కన వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు రౌడీలు బయటకు దిగారు.

“సాహిత్య గారూ! మా బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు, మర్యాదగా కార్ ఎక్కండి” అన్నాడు ఒకడు జేబులోంచి గన్ చూపిస్తూ.

సాహిత్య గుండె ఆగిపోయినంత పని అయింది. చుట్టూ జనాలు ఉన్నా, వాడు గన్ చూపించేసరికి ఆమెకు నోట మాట రాలేదు.

“నేను రాను… వదలండి నన్ను” అని అరుద్దాం అనుకునేలోపే వాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కార్‌లోకి లాగబోయాడు.

“రేయ్! వదులు!” అంటూ ఒక గంభీరమైన గొంతు వెనక నుంచి వినిపించింది.

కట్ చేస్తే… శివ అక్కడ వాలాడు! బైక్ దిగి సింహంలా నడుచుకుంటూ వచ్చాడు. సాఫ్ట్‌వేర్ మేనేజర్ ఫార్మల్ బట్టల్లో ఉన్నా, అతని కళ్లలో రౌద్రం కనిపిస్తోంది.

రౌడీలు శివను చూసి, “ఎవడ్రా నువ్వు? మధ్యలో వస్తున్నావు?” అంటూ ఒకడు శివపైకి చెయ్యి ఎత్తాడు.

 

శివ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వాడి చేతిని పట్టుకుని వెనక్కి విరిచి, కారు బోనెట్‌కు కేసి గట్టిగా బాదాడు. ‘ఢభ్’ మనే శబ్దానికి వాడు కింద పడిపోయాడు. ఇంకో రౌడీ గన్ తీయబోతుండగా, శివ వాడి పొట్టలో గట్టిగా తన్నాడు. వాడు రోడ్డు అవతల పడ్డాడు. జనాలు ఇది చూసి ఒక్కసారిగా చుట్టూ చేరడంతో, రౌడీలు భయపడి కార్ ఎక్కి వేగంగా పారిపోయారు.

శివ ఊపిరి పీల్చుకుంటూ సాహిత్య దగ్గరకు వచ్చాడు. సాహిత్య షాక్‌లో ఏడుస్తూ శివను గట్టిగా కౌగిలించుకుంది. “బావా! వాళ్లు నన్ను తీసుకెళ్లిపోదాం అనుకున్నారు బావా…” అంటూ వణికిపోయింది.

శివ ఆమెను ఓదారుస్తూ తన గుండెలకు హత్తుకున్నాడు. “నేను ఉన్నంతవరకు నిన్ను ఎవడూ తాకలేడు సాహిత్య. పద, ఇక్కడి నుంచి వెళ్దాం” అంటూ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. ఆమె భద్రత కోసం ఇకపై తన రూమ్‌లోనే ఉంచాలని డిసైడ్ అయ్యాడు.

రాబోయే రోజుల్లో శివ ప్రెసిడెంట్ వీరభద్రరావు సామ్రాజ్యాన్ని ఎలా కూలుస్తాడు? సాహిత్య అల్లరి పక్కన పెట్టి బావకు ఎలా హెల్ప్ చేస్తుంది?

 

ఇంకా ఉంది.

ప్లీస్ ఇగ్నోర్ మిస్టేక్స్.

ప్లీస్ ఫాలో మీ ♥️.