హా అవునత్తా నాకు నీ జడ అంటే భలే ఇష్టం.. మరి నాకెందుకు అత్త నీ అంత పొడవు జడ లేదు అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది స్వీటీ..
అయ్యో బంగారం నువ్వు ఇంకా చిన్న పిల్లవి కదా అందుకే నీకు ఇంత పొడవు జడ లేదు.. నువ్వు కూడా నా అంత పెద్ద అవుతావుగా..
అప్పుడు నీకు నాకంటే పొడుగ్గా ఉంటుంది జడ.. అప్పుడు నేను నీ జడ చూసి అమ్మో మా స్వీటీ జడ ఎంత బాగుందో అంటాను అని నవ్వుతు చెప్తుంది ప్రతిమ..
ప్రతిమ మాటలు విని నిజంగానే తనకి అంత పొడవు జడ వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతూ అత్త నువ్వు చెప్పింది నిజమా..
నిజంగానే నేను నీ అంత పెద్ద అయితే నాకు నీ అంత పొడుగు జడ వస్తుందా అని అని ఎంతో ఎక్సైటింగ్ గా అడుగుతుంది స్వీటీ..
వస్తుంది లేవే చిట్టి రాక్షసి.. ఇప్పుడున్న జుట్టుకే పిలకలు వేయించుకోమంటే నన్ను ముప్ప తిప్పలు పెట్టి ముప్పై చెరువుల నీళ్లు తాగిస్తున్నావు..