New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 167

మాంగళ్య బంధం – 167

లోపలికి వెళ్లి కూర్చున్నా ప్రణయ్ చూపంత ప్రతిమ గది వైపే ఉంటుంది.. దాన్ని గమనించిన  భరత్ ఇక్కడ కూర్చుని దొంగ చూపులు చూడకుంటే దొరలాగా నీ భార్య గదిలోకి వెళ్ళచ్చు కదరా బామ్మర్ది అంటు ప్రణయ్ ని ఆటపట్టిస్తాడు..

 

భరత్ మాటలకి తడపడి చూపు తిప్పేసిన ప్రణయ్  అయ్యో బావ నేనేమీ  నాకోసం మీ చెల్లెలి గది వైపు చూడలేదు.. ఇందాక నుండి స్వీటీ అత్త అత్త అని అడుగుతుంది కదా స్వీటీ ని పంపిద్దాం అని చూస్తున్నాను అంతే అని చెప్తాడు..

 

ప్రణయ్ మాటలు విన్న భరత్  అబ్బో అవునా.. నిజమా..ఇప్పుడు నేను నువ్వు చెప్పే మాటలు నమ్మాలా అంటు సాగదీస్తూ అడిగాడు అతని వంక అదోలా చూస్తు..

 

నువ్వు నమ్మినా నమ్మక పోయినా అదే నిజం బావా.. స్వీటీ అడిగింది కాబట్టే ప్రతిమ ఎక్కడ ఉంది అని చూశాను  లేదంటే నేను ఎందుకు చూస్తాను చెప్పు అంటాడు మొహాన్ని అమాయకంగా పెట్టి..

 

రేయ్ రేయ్ రేయ్ నువ్వు మొహాన్ని ఎంత అమాయకంగా పెట్టి స్వీటీ పేరు చెప్పి కవర్ చేయాలని ట్రై చేసిన  అది అస్సలు వర్క్ అవుట్ అవ్వదు..

 

నేను కూడా నీ వయసులో నుండే  వచ్చాను.. ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదా ఏంటి?  నువ్వు ప్రతిమని వెతికింది నా కూతురు కోసం కాదు నీ కోసమే అని నాకు అర్థమైందిలే కానీ,అయినా మా చెల్లిని చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేకపోతున్నావా బామ్మర్ది అంటు టీస్ చేస్తాడు భరత్..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue