బావ మాటలు వినగానే దొరికిపోయిన దొంగలా గతుక్కుమంటాడు ప్రణయ్.. వెంటనే సర్దుకుని కూర్చుని అమ్మో మా బావ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి..
నేనేం చేస్తున్నానో ఎటు చూస్తున్నానో కూడా గమనిస్తున్నారు.. ఇలా అయితే బావ నన్ను మాములుగా ఆడుకోడు అని మనసులో అనుకుని పైకి మాత్రం ఒక చిన్న స్మైల్ ఇచ్చి మీరు అలా అనుకుంటే నేనేమీ చేయలేను బావ..
నేనైతే మీ చెల్లెలు కోసం ఏమి వెతుక్కోవడం లేదు.. అయినా నేను ఎందుకు వెతుక్కుంటాను చెప్పు ఇప్పుడు తనే బయటకు వస్తుంది కదా అని చాలా సింపుల్ గా చెప్తాడు..
హ్మ్ సరే లే.. నువ్వెన్ని చెప్పిన నాకు నీ మీద నమ్మకం లేదు అని నవ్వుతు భరత్ చెప్పగా, నీ ఇష్టం అన్నట్టు ప్రణయ్ పెదవి విరిచి సైలెంట్ అయిపోగా ఇద్దరు ఆ టాపిక్ వదిలేసి టిఫిన్ తింటూ వుంటారు..
ప్రతిమ కోసం గదిలోకి వెళ్లిన స్వీటీ అత్తా అని నవ్వుతూ పిలుస్తుంది… చీర కట్టుకుంటున్న ప్రతిమ స్వీటీ పిలుపుకి తలెత్తి చూసి హాయ్ స్వీటీ..ఎంతసేపు అయింది రా మీరు వచ్చి అని నవ్వుతు అడుగుతూ దగ్గరికి రమ్మని పిలుస్తుంది..
ప్రతిమ పిలవడంతో పరుగున వచ్చి ప్రతిమ కాళ్ళను చుట్టేసి మేము ఇప్పుడే వచ్చాము అత్త..అమ్మమ్మ ఇంటికి వచ్చి చాలాసేపు అయింది.. నువ్వేమో అమ్మమ్మ ఇంట్లో లేవు కదా.. అందుకే నీకోసం అమ్మమ్మ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేసాము అని కళ్ళు, చేతులు తిప్పుతూ ముద్దు ముద్దుగా చెప్తుంది..