“నీ కొడుకుని వాళ్ళ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి సంబంధం మాట్లాడడాలి కదా..! అందుకు వస్తున్నారు పిన్ని.” అని అన్నాడు చిరునవ్వుతో శౌర్య.
“హ… ఇదంతా ఎప్పుడు జరిగింది రా..” అని ఆశ్చర్యంగా అడిగింది కౌసల్య.
సాంబశివరావు, రఘురామయ్య, కస్తూరి కూడా అలాగే చూశారు శౌర్యని.
“వేదకి నాకు ఒకరంటే ఒకరు ఇష్టం కానీ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే మ్యారేజ్ అని నేను అనేసరికి వాళ్ళ అమ్మానాన్నకి విషయం చెప్పింది..
“వాళ్ళు అన్ని ఎంక్వయిరీ చేసుకున్నారు ఏమో మార్నింగ్ లాహిరిని చూడడానికి సునంద గారు వచ్చారు, లహరి గురించి చెప్పాక రేపు మార్నింగ్ పెళ్లిచూపులకి మీ ఇంటికి వస్తున్నాము అన్నట్టుగా చెప్పారు.. మీరు ప్లాన్ గా ఉంటారు అని విషయం చెప్తున్నా.” అని అన్నాడు శౌర్య.