విక్కీని అలా తన కాళ్ళు పట్టుకుని బతిమాలడం చూసి తట్టుకోలేని విన్నీ అతన్ని ఆమె కాళ్ళ దగ్గర నుండీ పైకి లేపి సరే ముందు మీరెళ్ళి ఫ్రెషప్ అయి రాపోండి తర్వాత మాట్లాడుకుందాం అంటూ విక్కీని వాష్ రూం కి పంపిస్తుంది….
విన్నీ మాటే వేద వాక్కు అన్నట్టుగా విక్కీ మారు మాట్లాడకుండా ఫ్రెషప్ అవడానికి వెళ్ళిపోతాడు….
విక్కీ అలా వాష్ రూం లోకి వెళ్ళగానే విన్నీ ఫోన్ మోగుతుంది…
విన్నీ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల నుండీ ఒక అమ్మాయి హాయ్ విన్నీ అంటుంది….వెంటనే థాంక్యూ ఫర్ యూర్ హెల్ప్ అంటుంది విన్నీ … ఆ అమ్మాయి యూర్ వెల్కమ్ విన్నీ అంటుంది నవ్వుతూ …
విన్నీ చిన్నగా స్మైల్ చేయగా ఆ అమ్మాయి థిస్ ఇస్ నాట్ ఎండింగ్ విన్నీ జస్ట్ బిగినింగ్.. మీ న్యూ లైఫ్ నీ స్టార్ట్ చెయ్ ఆల్ ది బెస్ట్ అంటుంది….
థాంక్యూ సో మచ్ ఫర్ ఎవెర్య్థింగ్ అంటుంది విన్నీ… హహహ ఓకే విన్నీ బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది ఆ అమ్మాయి ….
ఇప్పుడు విన్నికి కాల్ చేసిన అమ్మాయి ఎవరు విన్నీ తనకి ఎందుకు థాంక్స్ చెప్పింది తెలుసుకోవాలనుకంటున్నారు కదా…