విక్కీ నైట్ అంత తెగ అల్లరి చేస్తు ఉండడంతో తెల్లరుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు….
వినీల లేట్ గా పడుకున్న సరే రోజు మార్నింగ్ తను లేచే టైం కి తనకి మెలుకువ రావడంతో నిద్రలేచి వాష్ రూం కి వెళ్లి స్నానం చేసి వచ్చి చీర కట్టుకుని,పూజ గదిలోకి వెళ్లి దేవునికి దీపం పెట్టి, పూజ పూర్తి చేసి బాబు లేచాడేమో బ్రష్ చేపిద్దాం అని రూం లోకి వస్తుంది…
వినీల వచ్చేసరికి బాబు లేచి ఉండడంతో నవ్వుతూ బాబు దగ్గరకి వెళ్లి అతని నుదుటున ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చిన్ను అని చెప్తుంది…
చిన్ను కూడా నవ్వుతూ అమ్మ కి ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్తాడు….
వినీల నవ్వుతూ చిన్ను ని ఎత్తుకుని రా నాన్న బ్రష్ చేద్దువు గాని అంటూ వాష్ రూం లోకి తీసుకెళ్లి చిన్నూతో బ్రష్ చేపించి ఫ్రెషప్ అయ్యాక అతన్ని తీస్కుని కిచెన్ లోకి వెళ్తుంది…
చిన్ను ని కిచెన్ గట్టు మీద కూర్చొ పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఫ్రిజ్ లో నుండి పాలు తెచ్చి గిన్నెలో పోసి వేడి చేసి చిన్నుకి పాలలో జూనియర్ హార్లిక్స్ కలిపి పాలను కాస్త చల్లార్చి చిన్ను కి తాపిస్తుంది….