రాత్రి 11:30.
మేఘన తన గదిలో పడుకుని ఫోన్ చూస్తోంది. ఆదిత్య మాత్రం హాల్లో ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడు.
అప్పుడే ఒక్కసారిగా కరెంట్ పోయింది.
“అబ్బా! ఇప్పుడేనా?” అంటూ మేఘన గది నుంచి బయటకు వచ్చింది.
“ఏమైంది?” అని ఆదిత్య అడిగాడు.
“కరెంట్ పోయింది. నాకు చీకటంటే కొంచెం భయం.”
“అయితే ఫోన్ టార్చ్ ఆన్ చేసుకో.”
“మీరు చెప్పే సలహాలన్నీ ఇలాగే ఉంటాయా?”
ఆదిత్య నవ్వుతూ ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు.
“రా. టెర్రస్ మీదకి వెళ్దాం. అక్కడైనా గాలి వస్తుంది.”
ఇద్దరూ మెట్ల వైపు నడిచారు.