ఎప్పటికైనా ఆమెకు తన ప్రేమ గురించి చెప్పి… ఆమెను పెళ్లి చేసుకొని తనతో పాటు ఆస్ట్రేలియా తీసుకెళ్లి… వాళ్ళ పేరెంట్స్ కి రెస్ట్ ఇచ్చి… అక్కడ వాళ్ళ బిసినెస్ లు ఆమెతో పాటు చూసుకోవాలనేది అతని డ్రీమ్…
ఇన్ని కోరికలు ఉన్నా ఆమె ముందు మాత్రం అతనికి నోరు పెగలదు తన ప్రేమ గురించి చెప్పడానికి… ఎక్కడ కాదంటుందో అనే భయంతో…
ఆఫీస్ కి వస్తే ఒక్కసారైనా చూడక పోతుందా అనే ఆశ… ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్తే… మళ్ళీ ఎప్పుడు ఆఫీస్ కి వెళ్లి ఆమెను చూస్తానా అనే ఎదురు చూపు…
ఈ రెండే తెలుసు అతనికి…