ఆవిడ మాటలకు ప్రతిమ చిన్నగా నవ్వుతూ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అత్తయ్య.. అమ్మలా చూసుకునే మీరు నా పక్కనే ఉన్నప్పుడు నాకు ఇంకెందుకు బెంగగా ఉంటుంది..
రాత్రి ఎందుకో అమ్మానాన్న గుర్తొచ్చి అలా అనిపించింది కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు.. మీరు నాతో ఒక తల్లిలానే ఉన్నారు కాబట్టి.. మీరు పక్కనే ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్తుంది..
హ్మ్ మంచిది బంగారం.. నువ్వు నాలో మీ అమ్మని చూసుకుంటే అందరికీ మంచిదే కదా.. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నదే మా కోరిక..
సరే మరి కూచి పూర్తయిపోయింది కదా నాకు బయట కాస్త పని ఉంది నేను వెళ్లేసి వస్తాను అని చెప్పి ఆవిడ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతారు..
యశోద గారు వెళ్లిపోయాక ఆ దేవుని గది నుండి బయటకు వచ్చిన ప్రతిమా హలో కూర్చుని ఆడుకుంటున్న పిల్లలని పిల్లలని ఆడిస్తున్న ప్రణయ్ ని ఒకసారి చూసి భాను వదిన ఎక్కడికి వెళ్లింది..
ఇందాక వీళ్ళతోపాటు ఇక్కడే కదా ఉనింది.. భరత్ అన్నయ్య కూడా లేనట్టు ఉన్నారు.. ఒకవేళ అన్నయ్య వదిన ఎక్కడికైనా వెళ్లారా..