New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 107

మాంగళ్య బంధం – 107

తన గదిలోకి పిల్లలతో వెళ్లిన ప్రతిమ  వాళ్లకి ఆడుకోడానికి తన దగ్గర చిన్నప్పటివి ఉండే బొమ్మలు ఇచ్చి, వాళ్లతో తను కూడా ఒక చిన్న పిల్లల కలిసిపోయి ఆటల్లో పడిపోతుంది..

 

శాంతి తో కలిసి ఆంటిని మొత్తం ఒకసారి చూస్తున్న భాను  చిన్నపిల్లల్లో చిన్నపిల్లల కలిసిపోయి ఆడుకుంటున్న బ్రతిమను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఈ ప్రతిమలో ఇంకా చిన్నతనం పోనే లేదు..

 

ఏంటో ఇలా కూడా చాలా ముద్దుగా ఉంది..  కల్మషం లేని పిల్ల.. ప్రతిమతో మా తమ్ముడు చాలా సంతోషంగా ఉంటాడు అని అనిపిస్తుంది..

 

వాళ్ళిద్దరు సంతోషమే కదా మాకు ముఖ్యం అనుకుంటుంది మనసులో..

 

అలా ఇంటిని చూసి వెళ్లి కూర్చోగానే శాంతి గారు అందరినీ భోజనానికి పిలుస్తారు.. అప్పటికే సమయం ఎనిమిది గంటలు అవుతూ ఉండడంతో, ఆ తర్వాత కార్యానికి కూడా సమయం అవుతుంది అని భావించి ఇంకేమీ మాట్లాడకుండా అందరూ భోజనానికి కూర్చుంటారు..

 

ప్రతిమా, ప్రణయ్ తప్ప.. అందరూ భోజనం చేసిన తరువాత వారిద్దరికీ స్పెషల్ గా భోజనం వడ్డించాలని ముందే అనుకోవడంతో వాళ్ళిద్దరిని పిలవకుండా మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతారు శాంతి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue