ఇష్టం లేని పెళ్లి చేసుకోవలసి వచ్చినప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఎలా స్పందిస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోలేనంత అమాయకుడు చిన్నపిల్లాడు కాదు అతను..
అందుకే ప్రతిమ మనసును అతను అర్థం చేసుకున్నాడు.. అలా అని ఆమెను బలవంతంగా బంధంలో ఉంచాలని కూడా అనుకోవడం లేదు..
వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన మూడుముళ్ల బంధానికి కాస్త విలువని ఇచ్చి ప్రతిమ మనసు మార్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అనుకుంటాడు..
ఆమె మనసు మార్చుకుని తనతో బంధాన్ని కొనసాగించాలి అనుకుంటేనే ప్రతి మని తన భార్యగా తన జీవితంలో ఉంచుకోవాలి అని, లేదంటే కష్టమైనా సరే ఆమె నిర్ణయానికి తలవంచాలి అని ముందే ఫిక్స్ అయిపోయాడు..
అందుకే ప్రతి మా ఇష్ట ప్రకారమే ఆమెకు దూరంగా ఉంటున్నాడు..ప్రతిమ పరిస్థితులను అర్థం చేసుకుని మారుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు..
ప్రణయ్, ప్రతిమ ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయి ఉండగా ఆ పెద్దావిడ మాత్రం వాళ్ళ పెద్దవాళ్లు సేకరించి ఇచ్చినా ముత్యాలు పగడాలు పూసలు కాసులు తాళిబొట్టు అన్ని ఒక తాడులో గుచ్చుతూ వాటికి ఉన్న విలువ గురించి వివరంగా చెప్తూ ఉంటుంది..