నా కూతురిని కళ్ళు మూసుకుని నీ చేతుల్లో పెట్టొచ్చు అన్న నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టి నా మనసులో నీ స్థానాన్ని ఆకాశం అంత ఎత్తులో ఉండేలా చేసుకున్నావు అని కాబోయే అల్లుడి వంక ఎంతో అభిమానం తో నిండిన గర్వం తో చూస్తారు..
బట్ ప్రతిమ మాత్రం శేఖర్ గారికి ఫుల్ ఆపోజిట్ గా ఫీల్ అవుతుంది.. ఆమె ప్రణయ్ వాళ్ళకి కాస్త దూరం గా ఉండడం వల్ల వాళ్ళు మనుషులు కనిపిస్తున్నారు తప్ప, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినిపించలేదు..
అప్పటి వరకు విత్ అవుట్ ఆడియో వీడియో మాత్రమే చూస్తన్న ప్రతిమ కి సడన్ గా ఆ అమ్మాయి ప్రణయ్ కి చేతులు జోడించి దండం పెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లి పోవడం చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పోయింది.
ఇంకాసేపట్లో అతను ఆమె కి లొంగి పోతాడు.. ఆ అమ్మాయిని తీసుకుని గది లోకి వెళ్తాడు.. ఎలానూ తన నాన్నగారు అక్కడే వున్నారు కనుక వాళ్ళిద్దరినీ అలా చూసి ఏదేదో చేసేస్తాడు అని ఎన్నెన్నో ఊహలు ఊహించుకున్న ఆమె ఊహలు అన్ని ఒక్కసారిగా మాయం అయిపోయినట్టున్నాయి..
ఆ అమ్మాయి సడన్ గా ఎందుకు అలా చేసిందో అర్ధం కాక వెర్రి మొహం వేసుకుని చూస్తుంటుంది..
ప్రణయ్ మాత్రం ఆ అమ్మాయి తన మాటల్ని అర్ధం చేసుకుని వెళ్లి పోవడం తో ఒక పని అయి పోయింది అన్నట్టుగా నిట్టూర్చి యూరియా చల్లుకోవడం కోసం సిద్ధం చేసుకునే పనిలో పడతాడు..