వాళ్ళది మన వూరే.. వాళ్ళది కూడా మనలానే వ్యవసాయ కుటుంబం.. వాళ్ళు నీకు చాలా బాగా తెలిసిన వాళ్లే సుమీ అంటు నవ్వుతు చెప్తారు యశోద. .
ఏంటి మన ఊరి సంబంధమా.. మన ఇంటికి వచ్చి మరి సంబంధం అడిగారా… ఎవరమ్మా వాళ్ళు అని ఆరాగా విషయం అడగగా యశోద శేఖర్, శాంతిలు వచ్చిన దగ్గర నుండి వెళ్లిన వరకు పూస గుచ్చినట్టు మొత్తం చెప్తారు..
అంతే ఆ మాటలు విన్న ప్రణయ్ అదిరి పడతాడు..
అమ్మ నువ్వేమంటున్నావో నీకయినా అర్ధం అవుతుందా.. శేఖర్ మావయ్య కూతురుని నేను పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అదోలా మొహం పెట్టి అడిగాడు…
కొడుకు మొహం అదోలా మారడం చూసిన యశోద అప్పటి వరకు నవ్వుతున్నది కాస్త నవ్వడం ఆపేసి ఏమైంది ప్రణయ్..
నీకు మన శేఖర్ మావయ్య కూతురిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా అని కాస్తంత కంగారుగా అడిగారు..