అన్విక తన నానమ్మ అన్నపూర్ణమ్మతో కలిసి వంటగదిలో హడావిడి చేస్తోంది.పూర్ణ ఈరోజు నేను స్పెషల్గా పాయసం చేస్తాను. నాన్నకి చాలా ఇష్టం కదా అంటూ గరిటె తిప్పుతోంది.
అమ్మో నువ్వు వంట చేస్తే అది పాయసం అవుతుందో లేక పాయసానికి ఇంకేదైనా పేరు పెట్టాలో చూడాలి అని వాసవి నవ్వుతూ కామెంట్ చేసింది.
ఏంటే వాసవీ నా కూతుర్ని అలా అంటావు? తను ఏం చేసినా అమృతం లాగే ఉంటుంది అని శ్రీనివాస్ సపోర్ట్ ఇచ్చారు.
అందరూ కలిసి హాయిగా భోజనం చేశారు. అన్విక తన నానమ్మతో కలిసి కాసేపు ఆడుకుంటూ, ఆటపట్టిస్తూ ఆ ఇల్లంతా నవ్వులతో నింపేసింది.
నాన్న ఈరోజు సాయంత్రం మనం ఆ కొత్తగా కట్టిన సిటీ పార్క్ కి వెళ్దామా, అక్కడ చాలా బాగుంటుందంట అని అన్విక అడిగింది.
సరే తల్లీ నువ్వు అడిగితే కాదంటానా సాయంత్రం వెళ్దాం, అని శ్రీనివాస్ ఒప్పుకున్నారు. అన్వికకు తెలియదు ఆ పార్కును నిర్మించింది మరెవరో కాదు, తను కలల్లో చూస్తున్న రణ్వీర్ సామ్రాట్ అని