కానీ రణ్వీర్ ఏమాత్రం చలించలేదు. అతను నిటారుగా నిలబడి, తన కోటు విప్పి పక్కన పడేశాడు. విక్రమ్ నువ్వు పంపిన డేటా ఏంటో ఒకసారి చెక్ చేసుకో అని రన్వీర్ అక్కడే ఉన్న చైర్ లో కూర్చున్నాడు.
విక్రమ్ కంగారుగా స్క్రీన్ చూశాడు. అక్కడ పోలీస్ కమిషనర్ మెయిల్ ఐడి కి బదులుగా “Access Denied – Fake Server” అని కనిపిస్తోంది.
ఏంటి, ఇది ఎలా సాధ్యం అని విక్రమ్ వణుకుతున్న వేళ్లతో టైప్ చేయడం మొదలుపెట్టాడు.అప్పుడే విక్రమ్ వెనుక ఉన్న అజయ్ తన గన్ తీసి విక్రమ్ తలకి పెట్టాడు.
అజయ్ నువ్వు నా మనిషివి కదా అని విక్రమ్ అరిచాడు.
కాదు విక్రమ్ నేను పుట్టినప్పటి నుంచి రణ్వీర్ సామ్రాట్ కి నీడను.
నువ్వు చేసిన ప్రతి తప్పుని నేను సార్ కి రిపోర్ట్ చేశాను అన్నాడు అజయ్.రానా మెల్లగా విక్రమ్ దగ్గరికి నడిచాడు.