అన్విక కూడా దేవి గారికి నమస్కరించి, చాలా మర్యాదగా మాట్లాడింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.
అనిత, రాహుల్ కూడా అన్వికతో వెంటనే కలిసిపోయారు. అనితకు అన్విక అల్లరి బాగా నచ్చింది.
అందరూ కలిసి పార్క్ లో నడవడం మొదలుపెట్టారు.
పెద్దవాళ్లంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటుంటే, రణ్వీర్, అన్విక, అనిత, రాహుల్ బోటింగ్ కి వెళ్లారు.
బోటింగ్ లో రణ్వీర్, అన్విక ఒకే బోటులో కూర్చున్నారు. చుట్టూ నీళ్లు,వాతావరణం చాలా రొమాంటిక్ గా ఉంది.
ఆరోజు జరిగిన దానికి మీరు భయపడ్డారేమో అనుకున్నాను రణ్వీర్ మెల్లగా అడిగాడు.అన్విక నవ్వుతూ, నేన భయపడితే అది అన్విక ఎలా అవుతుంది రణ్వీర్ గారు……
అయినా మీలాంటి పవర్ ఫుల్ మ్యాన్ పక్కన ఉంటే భయం ఎందుకు వస్తుంది అని కన్ను కొట్టింది.రణ్వీర్ ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు.