New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 18

మై మాఫియా డాన్ – 18

రణ్వీర్ ముఖంలో ఆ మృదుత్వం మాయమైంది. సిద్ధార్థ్ అతనికి ఒక లొకేషన్ పంపాడు. అన్విక మీద ఎటాక్ ప్లాన్ చేసిన జగ్గర్ ప్రధాన అనుచరుడు రుద్ర ఇప్పుడు రానా అదుపులో ఉన్నాడు.

 

రానా ఆ రహస్య స్థావరానికి చేరుకున్నాడు. రుద్రను గొలుసులతో వేలాడదీసి ఉంది. రానా తన చేతికి ఉన్న గ్లౌజులు సరిచేసుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు.

 

నా అన్వికను భయపెట్టి.. ఆమె నన్ను అసహ్యించుకునేలా చేస్తావా.అంటూ రానా ఒక ఇనుప రాడ్ తీసి వాడి మోకాళ్ళ మీద బలంగా కొట్టాడు.

 

ఎముకలు విరిగే శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించింది.

రుద్ర నొప్పితో కేకలు పెడుతుంటే, రానా వాడి గొంతు పట్టుకుని పైకి లేపాడు.

 

జగ్గర్ ఎక్కడున్నాడో నాకు అనవసరం. కానీ రేపటి నుంచి అన్విక కళ్ళలో ఒక్క కన్నీటి చుక్క కనిపించినా, నీ మనుషుల్లో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. 

 

ఈ విషయాన్ని నీ బాస్‌కి చెప్పు,అని వాడిని సజీవంగా కాల్చి చంపమని తన మనుషులకు ఆజ్ఞాపించాడు. రానా ప్రతీకారం అంత క్రూరంగా ఉంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue